వివాహిత ఆత్మహత్య
చెరుకూరు(రొద్దం) : కడుపునొప్పి తాళలేక వివాహిత శివమ్మ(30) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండలంలోని చెరుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. శివమ్మ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆమెకు రెండేళ్ల క్రితం అనిల్ అనే వ్యక్తితో వివాహం అయింది. వారికి 11 నెలల చిన్నారి ఉన్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ మున్నీర్హమ్మద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.