మీకు తెలుసా?
తెలుగు కవిత్వం వరకు విస్మరించలేని చరిత్రను నమోదుచేసిన దిగంబర కవుల గురించి ఈ తరానికి తెలియజెప్పే ఉద్దేశంతో ఈ వివరాలు అందిస్తున్నారు చెరుకూరి సత్యనారాయణ. వారి అసలు పేర్లు: మానేపల్లి హృషికేశవరావు (నగ్నముని), కుంభం యాదవరెడ్డి (నిఖిలేశ్వర్), బద్దం భాస్కరరెడ్డి (చెరబండ రాజు), ఆకారం వీరవెల్లి రాఘవాచారి (జ్వాలాముఖి), కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు (మహాస్వప్న), మురుకుట్ల మన్మోహన్ సహాయ్ (భైరవయ్య).
యాభై ఏళ్ల క్రితం, 1965 మే 6వ తేదీన అర్ధరాత్రి రిక్షా కార్మికుడు పాండుతో హైదరాబాద్ ఆబిడ్స్ సెంటర్‌తో తమ మొదటి సంపుటాన్ని ఆవిష్కరింపజేశారు. చెరబండరాజు 2-7-1982న, జ్వాలాముఖి 14-12-2008న అనారోగ్యంతో మరణించారు. నగ్నముని, నిఖిలేశ్వర్ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. మహాస్వప్న ప్రకాశం జిల్లా లింగసముద్రం గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు. భైరవయ్య సన్యాసం స్వీకరించి, విశాఖ-విజయనగరం మధ్య ఆశ్రమం స్థాపించుకుని భైరవానందస్వామిగా మారారు.