chess compitetions
-
ఉత్సాహంగా ఓపెన్ చెస్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరంలోని స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న మెమోరియల్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ పోటీలు ఉత్సహంగా సాగాయి. ఆదివారం ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ పోటీల్లో 30 మంది వరకు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం 1వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ బి.చిన్నంనాయుడు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరై విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదరంగం క్రీడ మేధావుల క్రీడ అని, అలాంటి క్రీడను చిన్నారులు ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కోచ్ బి.చిన్నారావు, వాసు, అప్పలనాయుడు, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే బాల బాలికల ఓపెన్ టోర్నీ విజేతగా ఎ. హరీష్మణికంఠ నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎ.లక్ష్మణరావు, బీబీ రమణ, బి.సుందర్రావు, పి.రమేష్, ఆర్.సాత్విక్, జి. గణేష్, సీహెచ్ఎల్ గాయత్రి, కె.శ్రీవి, పి.రాహుల్ వివిధ విభాగాల్లో విజేతలగా నిలిచారు. -
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ‘విక్టరీ’ విద్యార్థులు
అమలాపురం : జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహించిన అండర్–19 చదరంగం పోటీల్లో భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి, చెస్‌లో తమ వద్ద శిక్షణ పొందిన చైతన్యసాయిరాం చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్నాడని విక్టరీ అకాడమీ ప్రిన్సిపాల్ టి.వి.సురేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైతన్యసాయిరాం రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైనట్టు వివరించారు. రాజమహేంద్రవరం అల్యూమినియం అసోసియేషన్ హాల్లో శనివారం జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో నలుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాగా, అందులో తమ అకాడమీకి చెందిన ముగ్గురు ఉన్నారని తెలిపారు. తమ అకాడమీ విద్యార్థుల్లో చైతన్యతోపాటు రవీంద్రభారతి పాఠశాల విద్యార్థి ఎస్.సాయిహృషికేష్ రెండవస్థానం, నాథ్ విద్యానికేతన్ విద్యార్థి గోకరకొండ అజయ్ మూడవస్థానం సాధించారన్నారు. వీరంతా వచ్చేనెల 12న విజయనగరంలో జరిగే ఆంధ్రప్రదేశ్ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.