Chettinad Hospital
-
కోలుకుంటున్న నాజర్ కుమారుడు
చెన్నై : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటుడు నాజర్ కుమారుడు ఫైజల్ కోలుకుంటున్నాడు. తన స్నేహితులతో కలిసి అతను గురువారం పుదుచ్చేరి నుంచి చెన్నైకు కారులో వస్తుండగా ట్యాంకర్ లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చెందగా, ఫైజల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగినప్పుడు ఫైజల్ కారు వెనుక సీటులో కూర్చున్నాడు. ప్రస్తుతం అతడు కేలంబాక్కంలోని చెట్టినాడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫైజల్ ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సకు అతని శరీరం సహకరిస్తున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కాగా ఫైజల్ తమిళ చిత్రం 'శివం'కు గ్రాఫిక్ డిజైనర్ గా పని చేశాడు. -
ప్రముఖ నటుడు నాజర్ కుమారుడికి తీవ్ర గాయాలు
ప్రముఖ సినీ నటుడు నాజర్ కుమారుడు ఎన్. అబ్దులు అసన్ ఫైజల్ (23) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఫైజల్ అతడి నలుగురు స్నేహితులు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఫైజల్ స్నేహితులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఫైజల్ తోపాటు మరో స్నేహితుడు కూడా ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఫైజల్ తోపాటు అతడి స్నేహితుడిని నగరంలోని చెట్టినాడు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిద్దరికి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారు. ఫైజల్ ప్రమాదంపై సమాచారం అందుకుకున్న నాజర్ కుటుంబ సభ్యులు చెట్టినాడు ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.