Chicago airport
-
Video: ఎయిర్‌పోర్టులో వీర లెవల్లో తన్నుకున్న ప్రయాణికులు..
రోడ్డు మీద, గల్లీలో, బస్సు, రైళ్లలో కొందరు వ్యక్తులు కొట్టుకోవడం చాలానే చూశాం. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారుతుంటాయి. మరి కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నారో ఏమో గానీ ఏకంగా విమానాశ్రయంలో కొంతమంది ప్రయాణికులు గొడవపడ్డారు. ఒకరినొకరు వీర లెవల్లో తన్నుకున్నారు. ఇది ఎక్కడో కాదు.. సెక్యూరిటీ అధికంగా ఉండే అమెరికాలో జరిగింది. వివరాలు.. చికాగోలోని ఓ హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సోమవారం భారీ పోరాటమే జరిగింది. విమానం దిగి వస్తుండగా మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. విమానాశ్రయంలో బ్యాగేజ్ క్లెయిమ్ ప్రాంతంలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు చేయిచేసుకోవడంతో ఈ గొడవ ప్రారంభమైంది. టెర్మినట్ 3లో వద్ద జరిగిన ఈ ఘర్షణలో దాదాపు 12 మందికి పైగా పాల్గొన్నారు. చదవండి: రేయ్! మారండ్రా.. హెల్మట్ ధరించి మరీ రైడ్ చేస్తున్న కుక్క దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కొంతమంది వ్యక్తులు బీభత్సంగా కొట్టుకోవడం, మహిళలు నేలపై పడుకొని ఒకరు జుట్టు ఒకరు లాక్కోవడం కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘వీరిని బాక్సింగ్ విభాగంలో పోటీలకు పంపితే గోల్డ్ మెడల్ సాధించడం పక్కా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా తొలుత మహిళపై దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరిని 18 ఏళ్ల క్రిస్టోఫర్ హాంప్టన్, 20 ఏళ్ల టెంబ్రా హిక్స్‌గా గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన తర్వాత చికాగో ఎయిర్ పోర్టు ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రయాణికులు భద్రత, సౌకర్యం తమకు అత్యంత ముఖ్యమని వెల్లడించాయి. చదవండి: 14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్ నుంచి లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా.. Brawl at Chicago O’Hare airport this morning pic.twitter.com/fsH6n3yABd — Mr Bogus (@Mr_Bogus0007) May 23, 2023 -
విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి.. ఎందుకు ఆ పని చేశాడో తెలియదు. కానీ, ఆ నేరానికి అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఏకంగా విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు. అమెరికాలోని చికాగో విమానాశ్రయంలోకి ఈ ఘటన జరిగింది. రన్‌వే మీద దిగుతున్న విమానం ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచి రెక్కమీదకు వెళ్లాడు ఆ వ్యక్తి. అతన్ని శాన్ డియాగోకు చెందిన రాండీ ఫ్రాంక్ (57)గా గుర్తించారు.‘‘విమానం రన్‌వేపై దిగి గేటు వద్దకు వస్తుండగా అతను హఠాత్తుగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కమీదకు వెళ్లాడు. కిందకు జారి ఎయిర్‌ఫీల్డ్ మీదకు దిగాడు’’ అని చికాగో పోలీసులు తెలిపారు. సర్కస్ ఫీట్‌తో రిస్క్ చేఏసిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం ఏంటన్నది మాత్రం చెప్పట్లేదు అతను. ఇదిలా ఉంటే.. 2020లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ విమానం ల్యాండ్ అయ్యే టైంలో ఓ మహిళ ప్యాసింజర్.. ఉక్కపోస్తోందంటూ ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచి రెక్కల మీదకు వెళ్లి గాలిని పీల్చుకుంది. అయితే ఆమె మద్యం, డ్రగ్స్ మత్తులో అలా చేసిందనుకున్న పోలీసులు పరీక్షలు నిర్వహించగా.. అలాంటిదేం లేదని తేలింది. @fly2ohare guy jumps out of my plane before we get to the gate. @united UA2478 pic.twitter.com/xgxRszkBfH — MaryEllen Eagelston (@MEEagelston) May 5, 2022 -
విమానంలో మంటలు..
టేక్ఆఫ్ తీసుకుంటున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 383 ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించి, అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20మంది గాయాల పాలవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికాగో ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి రాత్రి 2.45 నిమిషాలకు టేక్ ఆఫ్ తీసుకుంటుండగా ఈ ఘటన సంభవించిన్నట్టు అథారిటీలు పేర్కొన్నారు. మొత్తం 170 మందితో ఈ విమానం టేక్ఆఫ్ అవ్వబోయింది. కానీ ఇంజిన్‌లో తలెత్తిన మెకానికల్ సమస్యతో, కేవలం 10 నుంచి 15 సెకన్లలోనే విమానంలో మంటలు వ్యాపించినట్టు ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి లెస్లీ స్కాట్ తెలిపారు. రన్‌వేపై వేగవంతం కాబోయిన విమానం వెలుపల మొదట పెద్ద పెద్ద పేలుళ్ల సంభవించి, దట్టమైన పొగలు వ్యాపించాయని, దీంతో తామంతా భయాందోళనకు గురయ్యామని ఓ ప్రయాణికురాలు చెప్పింది. కుడివైపు ఉన్న ప్రయాణికులందరూ కూడా ఎడమవైపు పడిపోయినట్టు పేర్కొంది. డోర్లు తెరవమని గట్టిగా కేకలు అరుస్తున్న సమయంలోనే విమానంలోకి మంటలు వ్యాపించినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో వెంటనే ఎమర్జెన్సీ స్లైట్ ద్వారా ప్రయాణికులందరినీ బయటికి పంపించి, బస్సుల సహకారంతో వారిని టెర్మినల్‌కు తరలించామని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపింది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగ, 2003లో తయారుచేసిన ఈ విమానం, ఆ మోడల్లో అమెరికన్ యంగెస్ట్ ఫ్లైన్గా పేరొంది.