మొక్కలకు జియోట్యాగింగ్ తప్పనిసరి
మహబూబ్నగర్ న్యూటౌన్ : ఇప్పటివరకు నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలని హరితహారం కార్యక్రమం చీఫ్ కన్సర్వేటర్ పి.కె.ఝా అధికారులకు సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి టెక్నికల్ అధికారులతో కలిసి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లాలో నాటిన మొక్కలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. వివరాల నమోదుపై టెక్నికల్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. హరితహారంపై రూపొందించిన మొబైల్ యాప్ వినియోగంపై పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో 1.93కోట్ల మొక్కలు నాటినట్టు డీఎఫ్ఓ రామమూర్తి తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొకలను నాటాలని పికె.ఝా అన్నారు. దీనికి జిల్లా ఎకై ్సజ్, కార్మిక శాఖ, విద్యాశాఖ, డ్వామా అధికారులు హాజరయ్యారు.