లెక్కలోకి వద్దాం..
- 19న ఇంటింటి సర్వే
- ఇవీ సర్వే అంశాలు..
కరీంనగర్: ‘‘ఈ నెల 19న ఇంటింటి సర్వేలో అందరూ అందుబాటులో ఉండాలె. ఆ రోజు లేనోడు లెక్కకు రాడు.. ఆ రోజు నేను కూడా ఇంట్లోనే ఉంటా..’’ ఇవీ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలు. దీన్నిబట్టే తెలుస్తోంది ప్రభుత్వం ఇంటింటి సర్వేను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనేది. అధికారులు ఇంటికి వచ్చి కుటుంబ వివరాలు సేకరిస్తారు. ఓపిగ్గా వారు అడిగిన వాటికి సమాధానం చెప్పాలి.
చెప్పే అంశాలపై వారికి ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేయాలి. సంబంధిత వివరాలతో ఉన్నటువంటి ధ్రువపత్రాలు చూపించాలి. ఒక్కసారి కుటుంబ వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైతే జీవితాంతం ఉంటాయి. పెద్దలు, పిల్లల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా ఈ నెల 19న ప్రభుత్వం చేపట్టిన సర్వేను సద్వినియోగం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో సర్వే అంశాలు ఏమిటి, ఏమేం అడుగుతారు, ఏ వివరాలు సేకరిస్తారనే దానిపై చాలామంది ప్రజల్లో సందేహాలున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే వివరాలపై కథనం..
గుర్తింపు వివరాలు : విభాగం-ఏ
1. జిల్లా :
2. మండలం :
3. గ్రామపంచాయతీ/మున్సిపాలిటీ :
4. రెవెన్యూ డివిజన్ :
5. నివాసం డివిజన్/వార్డు నెంబరు :
6. నివసిస్తున్న కాలనీ పేరు :
7. ఇంటి నంబరు :
8. ఇంటిలోని కుటుంబ సభ్యుల సంఖ్య :
కుటుంబ వివరాలు : విభాగం-బీ
1. ఇంటిపేరు :
2. కుటుంబ యజమాని పూర్తి పేరు :
3. తండ్రి/భర్త పేరు : 4. మతం :
5. కుటుంబ సభ్యుల సంఖ్య :
6. కులం :
7. గ్యాస్ కనెక్షన్ వివరాలు :
8. మొబైల్ ఫోన్ నెంబరు :
9. ఆదాయపు పన్ను వివరాలు :
అనాథల వివరాలు..
1. అనాథలు ఎక్కడ నివసిస్తున్నారు :
2. అనాథ ఆశ్రమం పేరు :
3. ఆశ్రమం ఉన్న గ్రామం పేరు :
4. ఆశ్రమం ఉన్న మండలం పేరు :
5. అనాథ పిల్లల స్థితి(తల్లిదండ్రులు, తోబుట్టువులు, కొడుకులు, కూతుళ్లు ఉన్నరా? లేదా? ఉంటే ఎక్కడ, వారి వివరాలు)
విభాగం-సీ
1. క్ర మసంఖ్య :
2. వ్యక్తి పేరు : కుటుంబ యజమానితో కలుపుకుని
3. కుటుంబ యజమానితో గల సంబంధం
4. ఆడ/ మగ :
5. పుట్టినతేదీ/వయస్సు :
6. వైవాహిక స్థితి :
7. విద్యార్హత :
8. బ్యాంకు/పోస్టాఫీసు వివరాలు :
9. ఉద్యోగం ఉన్నదా? లేదా? :
10. ఉద్యోగం పేరు.వివరాలు :
11. పింఛన్‌దారులైతే వివరాలు :
12. ప్రధానమైన వృత్తి :
13. ఆధార్ కార్డు నెంబరు :
విభాగం-డీ
1. క్రమ సంఖ్య :
2. వికలాంగుని పేరు :
3. ఎలాంటి వైకల్యం :
4. సర్టిఫికె ట్ వివరాలు :
5. వైకల్యం శాతం సర్టిఫికెట్ :
6. వైకల్యం సర్టిఫికెట్ ఉంటే ఐడీ నెంబర్ :
దీర్ఘకాలిక వ్యాధులు : విభాగం-ఈ
1. క్రమసంఖ్య :
2. వ్యాధికిగురైన వ్యక్తి పేరు :
3. వ్యాధి రకం :
ఇంటి వివరములు : విభాగం-ఎఫ్
1. నివాసం- సొంతం/అద్దె :
2. ఇంటి రకం :
3. గదుల సంఖ్య (వంట గది కాకుండా) :
4. కిరాయి, తాత్కాలిక ఇంట్లో ఉంటున్న వారికి ఇంకా ఎక్కడైనా సొంత ఇల్లు ఉందా ? :
5. కిరాయి, అద్దె ఇంట్లో ఉంటున్న వారికి సంబంధించి ఇంటి స్థలం ఉందా? లేదా :
6. మీరు ఎప్పుడైనా ప్రభుత్వ ఇంటిని లబ్ధి పొందారా? అవును/కాదు :
7. మరుగుదొడ్డి, విద్యుత్ మీటరు ఉందా? లేదా?
విభాగం-జీ, హెచ్
వ్యవసాయం, పశు సంపదకు సంబంధించిన వివరాలు
కుటుంబ సొంత చరాస్తుల వివరాలు : విభాగం-ఐ
1. ద్విచక్ర వాహనం : 2. ఆటో :
3. కారు/జీపు/ఇతర భారీ వాహనాల వివరాలు :
4. ట్రాక్టర్/ వ్యవసాయ యంత్రాలు :
5. ఎయిర్ కండిషన్ వివరాలు :
(పైవాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు తెలియజేయాలి)
6. తాత్కాలిక సంచార కుటుంబాలు/ శాశ్వత నివాసం/ఎంతకాలం నుంచి ఉంటున్నారో వారి వివరాలు :
7. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు/ ఎంత కాలం నుంచి నివసిస్తున్నారు/ ఏ రాష్ట్రం నుంచి వచ్చారు/ మాట్లాడే భాష/వచ్చిన సంవత్సరం
ధ్రువీకరణ
పైన తెలిపిన సమాచారం వాస్తవమని, యధార్థమని నేను ధ్రువీకరించుచున్నాను. పై సమాచారం అవాస్తవమని తేలినచో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు అనర్హుడుగా ప్రకటించగలరు. ఈ విషయాలను దైవసాక్షిగా ధ్రువీకరిస్తున్నాను.
1. కుటుంబ యజమాని/సభ్యుల సంతకం లేదా వేలి ముద్ర
2. ఎన్యుమరేటర్ సంతకం... వివరాలు
3. పర్యవేక్ష క అధికారి సంతకం... వివరాలు