జూన్ 2 తర్వాతే సీఎంగా ప్రమాణం ... కేబినెట్
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం గులాబి మయమైంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శాసనసభా పక్షం శనివారం మధ్యాహ్నం 12.00 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశమవనుంది. ఆ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకోనున్నారు. అనంతరం సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం, కేబినెట్ ఏర్పాటు తదితర అంశాలపై ఆ సమావేశంలో చర్చించనున్నారు.
అయితే హరీశ్ రావు, ఈటెల రాజేంద్రలతోపాటు కేటీఆర్‌ను కూడా కేబినెట్లోకి తీసుకోవాలని పార్టీ శ్రేణులు కేసీఆర్‌పై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. దాంతో ఆ అంశంపై చర్చ జరగుతుంది. అలాగే లోక్‌సభలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కడియం శ్రీహరిని ఈ సమావేశంలో ఎన్నుకుంటారు. సీఎంతో సహా18 మందితో కేబినేట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.