పుష్కర ప్రయాణంలో అపశ్రుతి
- చిన్నారి మృతి, మరో ఎనిమిది మందికి గాయాలు
కొవ్వూరు: పుష్కర ప్రయాణంలో అపశ్రుతి దొర్లింది. గుంటూరు జిల్లా నుంచి పుణ్యస్నానం కోసం పశ్చిమగోదావరికి బయలుదేరిన భక్తులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తోన్న నందిని (7) అనే చిన్నారి అక్కడికక్కడే మరణించగా మరో ఎనిమిదిమందికి తీవ్రగాయాలయ్యాయి.
గుంటూరు జిల్లా పెదపాడు మండటం తిమ్మాపురానికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.