పొంగి పొర్లుతున్న చీకుపల్లి వాగు
ఖమ్మం : ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వాగు పొంగి ప్రవహిస్తుంది. వాగులో నుంచి ఆ నీరు రోడ్లపైకి భారీగా వచ్చి చేరింది. దాంతో దాదాపు 25 గ్రామలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది.
భద్రచలం వద్ద నది నీటిమట్టం బుధవారం 27 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరిలో నీటి ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో లక్ష్యా 21 వేల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలారు. అలాగే తాగునీటి కోసం గోదావరి డెల్టాకు 12 వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు.