ఉత్తరాల ద్వారా వేధింపులు.. బాధితుడి ఫిర్యాదు
చిలకలగూడ (హైదరాబాద్): ఉత్తరాల ద్వారా వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైన ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన బాబురావు (45) వివాహితుడు. ఆయనకు భార్య, పిల్లలు కూడా ఉన్నారు. కొద్దిరోజులుగా ఆయన చిరునామాకు పోస్టుద్వారా ఉత్తరాలు వస్తున్నాయి.
వాటిలో అసభ్యపదజాలంతో కూడిన దూషణలు, వేధింపులు ఉంటున్నాయి. దీంతో బాబురావు ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ వేధింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.