కన్నార్పకుండా సూర్యుడి వంక..
అనంతపురం సప్తగిరి సర్కిల్ : నెల్లూరు జిల్లా చిలంకూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి అరగంటపైగా కన్ను ఆర్పకుండా సూర్యుని వంక చూస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. మంగళవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన సూర్యుడ్ని రెప్పను కొట్టకుండా చూస్తూ తనకున్న ప్రత్యేకమైన స్వభావాన్ని గురించి వివరించాడు. తాను ధర్మ గంగేశ్వర ఆలయం నిర్మించేందుకు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు పర్యటించానన్నారు. తాను ఎవరినీ యాచించడం లేదని వారి తృప్తితో వారే ముందుకు వచ్చి ఇచ్చిన దానితో సంతృప్తి పడుతున్నానని తెలిపాడు.