పెరిగిపోతున్న బాల యాచకులు
పట్టించుకోని అధికారులు
మెదక్: బాల యాచకుల సంఖ్య మెదక్ పట్టణంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. అయినా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కళ్లముందే బాలయాచకులు బడికి వెళ్లకుండా భిక్షాటన చేస్తున్నా పట్టించుకునే వారే లేరు. తల్లిదండ్రులకు సైతం ఆ పూట గడుస్తుండటంతో అదే గొప్ప అనుకుంటున్నారు. మెదక్ పట్టణంలోని గాంధీనగర్, నర్షిఖేడ్, తదితర ప్రాంతాల్లో బాలయాచకుల సంఖ్య అధిక సంఖ్యలో ఉంది. కాగా అధికారులు ఇప్పటికైనా స్పందించి బడీడు పిల్లలైన బాలయాచకులను బడిలో చేర్పిస్తే వారి భవిష్యత్తు బాగుపడుతుంది.