నేటి నుంచి ‘చైల్డ్ లైన్ సే దోస్తీ వీక్’
అనంతపురం సప్తగిరి సర్కిల్ : బాలల సంరక్షణకు సమాజ సహకారం ఎంతైనా అవసరమని, ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సోమవారం నుంచి ఏడు రోజుల పాటు ‘చైల్డ్ లైన్ సే దోస్తీ వీక్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు 1098 జిల్లా సహాయ కార్యకర్త కృష్ణమాచారి తెలిపారు. అనంతపురంలోని పెన్షనర్ల భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా విద్యాలయాల్లో అవగాహన కల్పించేందుకు యానిమేష¯ŒS చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
పిల్లల హక్కులు, వారిపై జరుగుతున్న అత్యాచారాలపై ఎంపిక చేసిన పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. చివరి రోజు బాలల హక్కుల దినోత్సవం, వారి హక్కుల గురించి ప్లకార్డుల ప్రదర్శన ఉంటుందన్నారు. సమావేశంలో 1098 జిల్లా కో–ఆర్డినేటర్ ఆదినారాయణ, టీం సభ్యులు అశోక్‌కుమార్, రామాంజినేయులు, కమలాక్షి, నాగవేణి, నారాయణస్వామి పాల్గొన్నారు.