పిల్లలను అమ్మినా కొనుగోలు చేసినా నేరమే
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: పిల్లలను అమ్మినా..కొనుగోలు చేసినా శిక్షార్హులేనని జిల్లా శిశుసంరక్షణ శాఖఅధికారి లక్ష్మణ్ హెచ్చరించారు మెదక్ మండలం వాడిపంచాయతీ పరిధిలోని మెట్టుతండాకు చెందిన దేవ్‌సోత్ అనిత, రవిదంపతులకు మూడో కాన్పులో సైతం ఆడపిల్ల పుట్టిందని గతనెల పసిపాపను విక్రయించిన విషయంపై ఇటీవల సాక్షి దినపత్రికలో ‘ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు’ అనేశీర్షిక వార్త ప్రచురితం అయింది. ఈ కథనానికి స్పందించిన జిల్లా శిశుసంరక్షణ అధికారులు సోమవారం తండాకు వచ్చి పసిపాపను విక్ర యించిన విషయంపై తల్లితండ్రులను ఆరాతీశారు.
మగబిడ్డ పుడుతుందను కుంటే ఆడపిల్ల పుట్టిందని ఇప్పటికే తమకు ఇద్దరు ఆడసంతానం ఉన్నందున పోషించే స్థోమతలేక విక్రయించామని పాపతల్లి తండ్రులు తెలిపారు. కొనుగోలు చేసిందెవరో తమకు తెలియదని రూ. 4 వేలుఇచ్చి కనిపించకుండా తీసుక పోయారని అనిత అధికారుల ముందు పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన జిల్లా అధికారి రత్నం మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏడుగురిని విక్రయించారని తెలిపారు. అందులో ఎక్కువగా కౌడిపల్లి మండలంలో జరుగుతున్నాయన్నారు. త్వరలో గిరిజనతండాల్లో పిల్లల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి పిల్లలను కాపాడేందుకు అన్నిచర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల తల్లితండ్రులకు సరైన అవగాహన లేకనే ఇలాజరుగుతోందన్నారు. పాపను ఎవరికి విక్రయించారో చెప్పకుంటే పోలీసుస్టేషన్లో కేసుపెట్టి కొనుగోలు చేసిన వారినుంచి పసిపాపను రప్పిస్తామని ఆయన అనిత దంపతులను హెచ్చరించారు. కొనుగోలు చేసిన వారువెంటనే శిశువును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ పాప అవసరం ఉంటే అధికారి కంగా దత్తత తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం అనిత, రవిదంపతుల మొదటి సంతానం స్వర్ణను బాలసదనంలో చేర్పించి ఉచిత చవువుకోసం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ తార్య మాట్లాడుతూ మెట్టుతండాలో అంగన్వాడి కానీ, పాఠశాలకానిలేక నిరక్షరాస్యత పెరుగుతుందని అధికారులకు చెప్పారు.
దీంతో ఈ విషయాన్ని తమప్రాజెక్టు అధికారిద్వార జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసెకెల్లి తండాలో అంగన్వాడీ సెంటర్‌తోపాటు, ప్రాథమిక పాఠశాలను సైతం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హమీఇచ్చారు. కార్యక్రమంలో సీడీపీవో విజయలక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్ వింద్యారాణి, సిబ్బంది విఠల్, సర్పంచ్ తార్య తధితరులున్నారు.