children drown
-
పిక్నిక్కు వెళ్లి మృత్యు ఒడిలోకి.. నదిలో మునిగి ఐదుగురు చిన్నారులు..
భోపాల్: మధ్యప్రదేశ్ కట్నీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా పిక్నిక్కు వెళ్లిన ఐదుగురు బాలురు కట్నీ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అందరీ వయసు 13-15 ఏళ్లే. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. గర్రా ఘాట్కు వెళ్లిన ఈ ఐదుగురు చిన్నారులు నదిలో స్నానం చేసేందుకు దిగే.. ప్రమాదవశాత్తు మునిగిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు వాళ్ల కోసం వెతికారు. ఈ క్రమంలోనే పిల్లల దుస్తులు ఘాట్లో కన్పించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు రెస్కూ ఆపరేషన్ నిర్వహించారు. కానీ ఐదుగురు పిల్లల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. అందరి మృతదేహాలను సహాయక సిబ్బంది మంగళవారం ఉదయం నది నుంచి బయటకు తీశారు. పసిప్రాయంలోనే ప్రపంచాన్ని వీడిన తమబిడ్డలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరిని చూసి స్థానికులు చలించిపోయారు. మరైవైపు.. మరణించిన చిన్నారుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. చదవండి: రైలులో గొడవ.. యువకుడ్ని కిందకు తోసేసిన తోటి ప్రయాణికుడు -
ప్రాణం తీసిన ఈత సరదా.. నలుగురు చిన్నారుల మృత్యువాత
యాచారం: ఈత సరదా నలుగురు చిన్నారులను బలి తీసుకుంది. చెరువులో పెద్ద గుంత ఉన్న విషయం తెలియక ఈతకు వెళ్లిన వారిలో ఒకరు మునిగిపోతుండగా కాపాడబోయి ఒకరి తర్వాత మరొకరు వరుసగా నలుగురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి అనుబంధ గ్రామం గొల్లగూడలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. యాచారం సీఐ లింగయ్య కథనం ప్రకారం.. గొల్లగూడకు చెందిన ఎండీ కాశీం, బీబీ జానీ దంపతుల కుమారుడు కహ్లీద్ (12), కూతురు సమ్రీన్ (14), కాశీం సోదరుడు రజాక్, హస్మ దంపతుల కుమారుడు రెహాన్ (10), వారి సమీప బంధువైన ఎస్కే హుస్సేన్, పార్జాన్ దంపతుల కుమారుడు ఇమ్రాన్(9) ఆదివారం మధ్యాహ్నం కొంతమంది బంధువులతో కలసి గ్రామ సమీపంలోని దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. తిరిగి గ్రామానికి వచ్చేటప్పుడు కహ్లీద్, సమ్రీన్, రెహాన్, ఇమ్రాన్ ముందుగా బయలుదేరారు. సమీపంలో ఉన్న ఎర్రకుంట వద్దకు వచ్చి సరదాగా ఈత కొట్టడానికి అందులోకి దిగారు. భారీ వర్షాలతో కుంట పూర్తిగా నిండిపోయి ఉంది. చెరువులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈత కోసం కుంటలోకి దిగిన ఓ బాలుడు మునిగిపోతుండగా గమనించిన మిగతావారు కేకలు వేస్తూ అతడిని కాపాడబోయి ఒకరి తర్వాత ఒకరు నలుగురూ మునిగి పోయారు. అదే సమయంలో వారితో కలసి ఈత కొట్టడానికి కొంత ఆలస్యంగా వచ్చిన మరో బాలుడు అయాన్ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి గ్రామానికి వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, సమీపంలోని వ్యవసాయ బావి వద్ద పనిచేస్తున్న రైతు లక్ష్మయ్య చిన్నారుల అరుపులు విని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చేసరికే నలుగురు చిన్నారులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఒకేరోజు నలుగురు పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్నారులను విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. చదవండి: షాకింగ్ ఘటన.. రెండో భార్యను లాడ్జికి తీసుకెళ్లి.. -
నీటిలో మునిగి 14 మంది చిన్నారుల మృతి
మాస్కో: రష్యాలో జరిగిన పడవ ప్రమాదంలో కనీసం 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఫిన్లాండ్ సరిహద్దుకు సమీపంలోని స్యమొజీరో సరస్సులో పడవ తిరగబడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమ్మర్ క్యాంపుకు వెళ్లిన చిన్నారులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 14 మృతదేహాలను కనుగొన్నామని రష్యా దర్యాప్తు కమిటీ అధికారి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు. చిన్నారులందరూ 14 ఏళ్ల లోపువారేనని చెప్పారు. మృతుల్లో పెద్దలు ఎవరూ లేరని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నలుగు క్యాంప్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. సాయంకాలం వేళ రెండు పడవల్లో విద్యార్థులు విహారానికి వెళ్లినప్పుడు బలమైన అలల ధాటికి తిరగబడ్డాయన్నారు. సహాయక సిబ్బంది 30 మందిని కాపాడినట్టు తెలిపారు. మృతుల్లో 10 మంది మాస్కోకు చెందిన వారిగా గుర్తించారు.