childrens killed
-
విధి వికృత ఆట
సిడ్నీ: విద్యా సంవత్సరం ముగింపు రోజు.. చిన్నారుల ఆటపాటలు, నవ్వులు, కేరింతలతో స్కూలు ప్రాంగణమంతా సందడిగా ఉంది. అంతలోనే చోటు చేసుకున్న అనూహ్య ఘటన వారందరినీ షాక్‌కు గురి చేసింది. తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారులు ఎక్కి ఆడుకుంటున్న బౌన్సీ క్యాజిల్ (కోట ఆకారంలో ఉండే గాలి నింపిన దళసరి బెలూన్‌తో చేసిన నిర్మాణం)ను అకస్మాత్తుగా వీచిన బలమైన సుడిగాలి పైకి లాక్కెళ్లిపోయింది. దీంతో, అందులో ఆడుకుంటున్న 9 మంది చిన్నారులు కిందపడిపోయారు. సుమారు 33 అడుగుల ఎత్తు నుంచి వారు పడిపోవడంతో నలుగురు అక్కడికక్కడే తుదిశ్వాస విడవగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులైన మరో నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా 10, 11 ఏళ్ల ఆరో గ్రేడ్ చదువుకుంటున్న బాలబాలికలని సమాచారం. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా రాష్ట్రం డేవన్పోర్ట్లోని ఓ స్కూల్లో గురువారం ఉదయం ‘ఫన్డే’ ఉత్సవాల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, తీవ్ర ఆందోళనతో హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకుని, తమ చిన్నారుల క్షేమ సమాచారం గురించి వాకబు చేశారు. ఇది అనూహ్యంగా చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. -
పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య!
ఫరూఖాబాద్(యూపీ): పుట్టినరోజు అంటూ 23 మంది చిన్నారులను పిలిచి బంధించిన వ్యక్తిని పోలీసులు గురువారం అర్ధరాత్రి హతమార్చగా, తప్పించుకునేందుకు ప్రయత్నించిన అతని భార్య.. గ్రామస్తుల చేతిలో చనిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా కసారియా గ్రామంలో జరిగిందీ ఘటన. చిన్నారులను బందీగా చేపట్టి, వారిని చంపేస్తామని బెదిరిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సంచలన ఘటన చివరకు సుఖాంతమైంది. సుభాష్ బాథమ్(40)పై గతంలో హత్య కేసు ఉంది. బెయిల్‌పై బయటకు వచ్చాడు. కూతురి పుట్టిన రోజు వేడుకులకు రావాలంటూ గురువారం గ్రామంలోని చిన్నారులను తన ఇంటికి పిలవగా 23 మంది పిల్లలొచ్చారు. అందర్నీ ఇంటి బేస్మెంట్లో బంధించాడు. హత్య కేసును వెనక్కి తీసుకుంటామని, ప్రభుత్వ ఇల్లు ఇస్తామని నచ్చజెప్పేందుకు యత్నించినా సుభాష్ వినలేదని డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. సుభాష్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులకు, ఒక గ్రామస్తుడికి గాయాలయ్యాయన్నారు. ఇంటి వెనుకవైపు నుంచి తలుపు బద్ధలు కొట్టి పోలీసులు లోపలికి వెళ్లారు. వారిపై సుభాష్ కాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. తర్వాత పిల్లలందరినీ పోలీసులు రక్షించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన సుభాష్ భార్య రూబీను గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. గాయాలతో ఆమె ఆసుపత్రిలో మరణించింది. సుభాష్ ఇంటి నుంచి పోలీసులు తుపాకిని, రైఫిల్‌ను, రెండు డజన్ల కాట్రిడ్జ్‌లను, 25 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే పిల్లలను బందీలుగా ఉంచుకునే ఆలోచనలో ఆ దంపతులు ఉన్నట్లు అర్థమవుతుందని పోలీసులు చెప్పారు. -
నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
ఇంక్లైన్ కాలనీ : కరీంనగర్ జిల్లా ఎయిట్ ఇంక్లైన్ కాలనీలోని శ్రీలంక షిర్కే క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఓ నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు మోహిద్(9), సల్మాన్(7) లను అన్నదమ్ములుగా గుర్తించారు. ఇద్దరు చిన్నారుల మృతితో కాలనీలో విషాదం అలుముకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.