childs dead
-
క్రికేట్ ఆడుతుండగా విషాదం.. పిడుగు పడటంతో
-
క్రికేట్ ఆడుతుండగా విషాదం.. ముగ్గురు మృతి
సాక్షి, గుంటూరు : పిడుగుపాటుకు ముగ్గురు పిల్లలు మృతి చెందటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా గురజాల మండలం సమాధానంపేటలో సోమవారం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుకుంటున్నపిల్లలపై పిడుగు పడటంతో పవన్ నాయక్(16) హరిబాబు(15) మనోహర్ నాయక్(12)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. తమ పిల్లలు ఇక తిరిగిరారని తెలిసిన ఆ కుటుంబ సభ్యులు గుండలవిసేలా రోదించారు. -
ఇద్దరు చిన్నారుల దుర్మరణం
హుజూరాబాద్ రూరల్ / జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని జమ్మికుంట మండలం మోత్కులగూడెంలో పక్షం రోజుల క్రితం కుక్కకాటుకు గురైన ఆరేళ్ల బాలు డు శుక్రవారం రాత్రి చనిపోగా, హుజురాబాద్ మండలం చెల్పూర్ పరిధి రాజాపల్లిలో నాలుగేళ్ల చిన్నారిని పాము కాటు వేయడంతో చనిపోయింది. రాజపల్లెకు చెందిన పత్తి కోమల్‌రెడ్డి, అర్చనల కుమార్తె కీర్తన(4) ఎల్కేజీ చదువుతోంది. సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటివద్దే ఉంది. సాయంత్రం ఇంటి సమీపంలోని చెట్ల పొదల వద్ద ఆడుకుంటుం డగా పాము కాటేసింది. ఈ విషయం చిన్నారికి తెలియకపోవడంతో ఏడుస్తూనే ఉండిపోయిం ది. రాత్రి 9 గంటల ప్రాంతంలో అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. అలాగే, మోత్కులగూడెం గ్రామానికి చెందిన రమేశ్, లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. రమేశ్ ‘108’ పైలట్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సాయిరాం (6) యూకేజీ చదువుతున్నాడు. గతనెల 19న మధ్యాహ్నం ఇంటి కొస్తుండగా.. కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. లలిత ఇంట్లో నుంచి పరుగెత్తుకుం టూ వచ్చేలోపే మెడభాగంలో కాట్లుపడ్డాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సాయిరాం శుక్రవారం అకస్మాత్తుగా పడిపోయాడు. దీంతో తల్లి 108లో జమ్మికుంట ఆస్ప త్రికి తీసుకెళ్లింది. ఏ ఆస్పత్రిలోనూ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో హుజూరా బాద్‌కు తీసుకెళ్లింది. వారి సూచన మేరకు హైదరాబాద్ తీసుకెళ్లగా చనిపోయాడు. -
ఇద్దరు చిరు వ్యాపారులను బలిగొన్న లారీ
అనపర్తి(బిక్కవోలు): అనపర్తి మండలం పులగుర్త గ్రామం రామకోటి ప్రాంతం వద్ద లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. ద్వారపూడి గ్రామానికి చెందిన సంగడాల వెంకటేష్(35), అయినవిల్లి మండలం కె.జగన్నాథపురానికి చెందిన కొమ్మశెట్టి సురేష్(25) కలిసి ద్వారపూడిలో మాంసం దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం వీరు రామచంద్రపురంలో కోళ్లను కొనుగోలు చేసి, మోటార్ బైక్‌పై తిరిగి వస్తున్నారు. అదే సమయంలో మండపేట నుంచి కాకినాడ వైపు వెళుతున్న లారీ వారి బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఎస్సై కె.కిషోర్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజవొమ్మంగిలో ఆగని శిశు మరణాలు
వెలుగు చూసిన మరో శిశువు మృతి ఐదుకు చేరిన మృతులు రాజవొమ్మంగి మండలంలో శనివారం మరో శిశు మరణం వెలుగు చూసింది. దీంతో ఈ ప్రాంతంలో శిశువుల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మండలంలోని చికిలింత పంచాయతీ దుర్గానగర్‌లో రెండు నెలల పసికందు గురువారం కాకినాడ జీజీహెచ్‌లో మరణించగా శనివారం సాయంకాలం వెలుగు చూసింది. దుర్గానగర్ శివారు చేనుమఖాల్లో నివాసం ఉంటున్న కొచ్చ శ్రీలక్ష్మికి జడ్డంగి పీహెచ్సీలో తొలికాన్పులో మగబిడ్డ పుట్టాడు. మూడు రోజుల కిందట ఆ బిడ్డకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్‌లో బుధవారం చేర్పించగా చికిత్సపొందుతూ మరణించాడు. – రాజవొమ్మంగి