
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుంటూరు : పిడుగుపాటుకు ముగ్గురు పిల్లలు మృతి చెందటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా గురజాల మండలం సమాధానంపేటలో సోమవారం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుకుంటున్నపిల్లలపై పిడుగు పడటంతో పవన్ నాయక్(16) హరిబాబు(15) మనోహర్ నాయక్(12)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. తమ పిల్లలు ఇక తిరిగిరారని తెలిసిన ఆ కుటుంబ సభ్యులు గుండలవిసేలా రోదించారు.