Thunderbolt fell
-
పత్తి ఏరడానికి చేనుకు వెళ్తే..
సాక్షి, బేల(ఆదిలాబాద్ ): మండలంలోని సదల్పూర్ రెవెన్యూ గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో పిడుగుపాటుతో గురువారం ఇద్దరు మహిళ కూలీలు మృతిచెందారు. వీరిలో ఒకరు రైతు కుటుంబం కాగా, మరోకరిది కూలీ కుటుంబం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులోని రైతు రేషవార్ ఆశన్న పత్తి చేనులో బేల, జూనోని గ్రామాల నుంచి 8 మంది మహిళ కూలీలు ఆటోలో పత్తి ఏరడానికి వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వీరంతా చెట్ల కిందకు పరుగెత్తారు. దీంతో ఒక చెట్టుకు కిందకు వెళ్లిన నలుగురు పిడుగుపాటుకు గురయ్యారు. జూనోనికి చెందిన నాగోసే ప్రమీల(33), బేలకు చెందిన కనక దేవిక(29)లు అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన జూనోని గ్రామానికి చెందిన మరో ఇద్దరు లెన్‌గురే ఉష, నాగోసే దుర్పతలను రిమ్స్‌కు తరలించారు. వీరు ప్రస్తుతం కోలుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని ఏఎస్సై నజీబ్ పరిశీలించారు. ఆయన వెంట కానిస్టేబుల్ స్వామి ఉన్నారు. -
పిడుగుపడే సమాచారం ఇక మనచేతుల్లోనే
సాక్షి, వల్లూరు: ప్రస్తుతం వర్షా కాలం. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుని భారీ శబ్దాలతో ఉరుములు, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో మెరుపులు కనిపిస్తున్నాయంటే.. దగ్గర్లో ఎక్కడో ఓ చోట పిడుగు పడే అవకాశం ఉందని భావిస్తాం. పిడుగు పడటం ప్రస్తుత కాలంలో సర్వ సాధారణంగా మారింది. ఎన్నో మూగజీవాలతోపాటు ఎందరో మనుషులు బలై ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పొలాలు, చెట్ల కింద వున్న ఉన్న వారే ఎక్కువగా గురవుతున్నట్లు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెలుస్తోంది. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ పిడుగు పాటుకు గురైతే వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రథమ చికిత్స ఎలా అందించాలి, సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం మొదలైన అంశాలపై నిపుణుల సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి. వీటిని పాటించి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించుకోవడానికి ప్రయత్నిద్దాం. పిడుగు పడే సమయంలో వచ్చే మెరుపులో ఎంతో తీవ్రమైన శక్తి దాగి ఉంటుంది. అది తాకిన మరుక్షణం జీవి ఏదైనా ప్రాణాన్ని కోల్పోవడం జరుగుతుంది. పిడుగు దాదాపుగా ఎత్తైన చెట్లు, భవనాలు, ప్రదేశాలు, వస్తువులపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎత్తు తక్కువ ఉన్న చోట కాస్త సురక్షితం. పచ్చని చెట్లను తాకే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి ఆ సమయంలో చెట్ల కింద ఉండరాదు. ఆరుబయట ఉంటే.. ఆరుబయట ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు సురక్షిత భవనాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించాలి. పొలంలో పూర్తి ఆరుబయట ఉంటే మొక్కల కన్నా మనిషి ఎక్కువ ఎత్తు ఉంటాడు.. కాబట్టి పిడుగు అతనిపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు పడేటపుడు అర చేతులతో చెవులను మూసుకుని తల వంచుకుని నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి. ఇంట్లో ఉంటే.. మొబైల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యుత్‌కు అనుసంధానం చేయరాదు. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకుండా ఉండటం మంచిది. పిడుగుపాటుకు గురైతే .. పిడుగుపాటుకు గురైతే అంబులెన్స్, వైద్యులకు సమాచారం అందించాలి. బాధితుడికి ప్రథమ చికిత్స అందించాలి. పిడుగు తాకిన ప్రదేశం తడిగా ఉంటే.. దుప్పటి లాంటి వస్త్రంపై పడుకోబెట్టాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. యాప్ డౌన్ లోడ్ .. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘వీఏజేఆర్‌ఏపీఏఏటీ ’ అని టైప్ చేసి అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జియో ట్యాగింగ్ కోసం మొబైల్‌ఫోన్ నంబర్‌ను అడుగుతుంది. నంబర్‌ను ఎంటర్ చేసి భాష ఎంచుకోవాలి. యాప్ ముఖ చిత్రం కనిపిస్తుంది. లొకేషన్ సెట్ చేసుకుంటే.. మీరు ఉండే ప్రదేశంలో పిడుగు పడే అవకాశాలపై తగిన సమాచారం, సూచనలు అందిస్తుంది. యాప్ రెండు రకాల సమాచారాన్ని ఇస్తుంది. ఎడమ చేతి వైపు పిడుగు గుర్తుతో వున్న చోట క్లిక్ చేస్తే మీరున్న ప్రాంతం మ్యాప్ వస్తుంది. మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో వలయాలు కనిపిస్తాయి. వలయాల పక్కన అంకెలు ఉంటాయి. ఆ అంకెల ప్రకారం పిడుగు పడే అవకాశాలను చూపిస్తుంది. పిడుగు ఎంత దూరంలో పడుతుందో.. పిన్ గుర్తు ద్వారా స్పష్టత ఇస్తుంది. యాప్ కుడి భాగంలో పిడుగు పాటు హెచ్చరికలు తెలిపే బటన్ ఉంటుంది. యాప్ ఆన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. వజ్రపాత్తో ముందస్తు సమాచారం పిడుగుపాటు వల్ల ఎదురయ్యే విపత్తును నివారించడానికి విపత్తుల నివారణ సంస్థ ఆధనిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పిడుగు పాటుకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తిస్తుంది. 30 నిమిషాల ముందుగా అధికారుల ద్వారా ఆ ప్రాంత సెల్ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లను అందిస్తుంది. దీనికి తోడు ఇటీవల ఇస్రో సహకారంతో పిడుగు పాటు గురించి ముందస్తు సమాచారం తెలుసుకోడానికి.. వజ్రపాత్ అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌తో పిడుగు ఎక్కడ పడుతుందో ముందే తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఉంటే చాలు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని.. పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని ఇట్లే తెలుసుకోవచ్చు. రంగులను బట్టి.. తీవ్రత ► మెరుపు చిహ్నం, శీర్షిక నీలం రంగులో వుంటే మీరు పిడుగు పడే స్థలానికి దూరంగా వున్నట్లు అర్థం. ► మెరుపు చిహ్నం, శీర్షిక పసుపు రంగులో వుంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 15 నుంచి 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్నట్లు లెక్క. ► మెరుపు చిహ్నం, శీర్షిక నారింజ రంగులో వుంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 8 నుంచి 15 కిలోమీటర్ల సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ► మెరుపు చిహ్నం, శీర్షిక ఎరుపు రంగులో ఉంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 0 నుంచి 8 కిలోమీటర్ల సమీపంలో వున్నట్లు.. అంటే అత్యంత ప్రమాదరకరమైన స్థలమని అర్థం. -
జమ్మూ కాశ్మీర్లో పిడుగుపాటుకు వందకు పైగా గొర్రెలు మృతి
-
గొల్లుమన్న గుడ్డెందొడ్డి
ఓ మహిళ, ఆమె కుమారుడు–కోడలు సోమవారం ఉదయమే లేచి పొలం పనులకు వెళ్లారు.. సొంత పొలంలో సాగు చేసిన సీడ్ పత్తిలో కలుపు తొలగించారు.. మధ్యాహ్నం అక్కడే భోజనం ముగించుకుని మళ్లీ పనుల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై వర్షసూచన ఉండడంతో ఇంటిముఖం పట్టారు.. అంతలోనే వర్షం, మెరుపులు ప్రారంభమయ్యాయి.. దీంతో పక్కన ఉన్న చెట్టు కిందకు చేరగా పిడుగు పాటుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం గుడ్డెందొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, పిడుగు పాటుతోనే నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సల్కర్పేటలో రైతు మేకల వెంకటయ్య మృతి చెందాడు. ధరూరు (గద్వాల): మండల పరిధిలోని గుడ్డెం దొడ్డి గ్రామం ఘెల్లుమంది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిడుగుపాటుకు బలికావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొలం పనులు ముగించుకుని ఇంటికి పయనమమైన ముగ్గురు కాసేపైతే ఇంటికి చేరేవారు. అంతలోనే పిడుగు యమపాశంలా వచ్చి వారి ప్రాణాలను హరించుకుని వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. గుడ్డెందొడ్డి గ్రామానికి చెందిన కుర్వ జంగిలప్పకు నాలుగు ఎకరాల పొలం ఉంది. కొన్ని జీవాలు కూడా ఉండటంతో వాటిపై ఆధారపడి బతుకుతునానరు. రోజులాగే పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళదామని అనుకునేలోపే సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు రావడంతో కుర్వ జంగిలమ్మ భార్య శంకరమ్మ (50), కుమారుడు గోపాల్ (34), కోడలు మాణిక్యమ్మ (30) ఓ చెట్టుకిందకు వెళ్లి తలదాచుకున్నారు. అదే ప్రాంతంలో పెద్ద మెరుపుతో కూడిన పిడుగు పడింది. దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమీపంలో ఉన్న ఇతర కూలీలు, చుట్టు పక్కల రైతులు గమనించి చెట్టువద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినా దాదాపు గంట పాటు ఎడ తెరపిలేకుండా వర్షం కురిసింది. చీకటి కావడంతో ముందు వారు వెళ్లేందుకు భయపడ్డారు. అనంతరం కొందరు గ్రామ యువకులు టార్చి లైట్లతో వచ్చి పిడుగు పడిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే వారు విగత జీవుల్లా పడి ఉన్నారు. విషయం తెలుసుకున్న జంగిలప్ప గొర్రెల మంద నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించాడు. ఒక్కగానొక్క కొడుకు, అతని భార్య, తన ఇల్లాలు అందరిని కోల్పోవడంతో తల్లడిల్లిపోయాడు. దిక్కు తోచని స్థితిలో చిన్నారులు పిడుగు పాటుకు గురై మృతి చెందిన గోపాల్, మాణిక్యమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్దదైన జయసుధ 9వ తరగతి, పెద్ద మల్లన్న, చిన్న మల్లన్నలు 6వ తరగతి పక్కనే ఉన్న ఉప్పేరు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఈ ముగ్గురు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద రోదిస్తున్న తీరు అందరిని కలిచి వేసింది. నాయకుల పరామర్శ విషయం తెలుసుకున్న గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలు వేర్వేరుగా సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. గ్రామంలోకి తీసుకు వెళ్తేందుకు తగు ఏర్పాటు చేశారు. కుటుంబానికి అన్ని విధాలా ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు, పిల్లలకు ధైర్యం చెప్పారు. సల్కర్పేటలో మరో రైతు బిజినేపల్లి రూరల్: రైతన్నల పాలిట పిడుగులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. సోమవారం మండల పరిధిలోని సల్కర్‌పేట గ్రామంలో పంట పొలంలో ఉన్న రైతుపై పిడుగు పడింది. వివరాల ప్రకారం సల్కర్‌పేట గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య (40) తనకున్న మూడెకరాల పొలంలో మొక్కలు, పత్తి పంటలు వేశాడు. తెల్లవారుజామునే పంటను చూసేందుకు పొలం వద్దకు వెళ్లాడు. 6.45 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. చొప్పగూడు వద్ద తలదాచుకునేందుకు వెళ్లగా సరిగ్గా అదే ప్రాంతంలో పిడుగు పడింది. దీంతో వెంకటయ్య సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే వెంకటయ్యను నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పుడే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఆస్పత్రి ఆవరణలో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. -
క్రికేట్ ఆడుతుండగా విషాదం.. పిడుగు పడటంతో
-
క్రికేట్ ఆడుతుండగా విషాదం.. ముగ్గురు మృతి
సాక్షి, గుంటూరు : పిడుగుపాటుకు ముగ్గురు పిల్లలు మృతి చెందటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా గురజాల మండలం సమాధానంపేటలో సోమవారం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుకుంటున్నపిల్లలపై పిడుగు పడటంతో పవన్ నాయక్(16) హరిబాబు(15) మనోహర్ నాయక్(12)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. తమ పిల్లలు ఇక తిరిగిరారని తెలిసిన ఆ కుటుంబ సభ్యులు గుండలవిసేలా రోదించారు. -
కూలి బతుకులపై పిడుగు
వెదురూరు(చాపాడు):ఓ వైపు పెనుగాలులు.. మరోవైపు భారీ వర్షం.. ఇంకో వైపు ఉరుములు.. మెరుపులు.. ఇంతలో ఉన్నట్లుండి పొలాల్లో పెద్ద శబ్దంతో పిడుగుపాటు.. కళ్లు మూసి తెరిచేలోగా పొలాల్లో పనులు చేసుకుంటున్న తల్లీకూతుళ్లు మాడి మసై పోయారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం వెదురూరు గ్రామానికి చెందిన చౌటపల్లె హుస్సేన్ పీరా భార్య చౌటపల్లె ఖాసీంబీ(33), కూతురు ఆయీషా(18)లు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు గురై మృతి చెందారు. ఖాజీపేట మండల మిడుతూరు రెవెన్యూ పొలంలో వెదురూరు గ్రామానికి చెందిన ఇక్బాల్ అనే రైతు పసుపు పంట సాగు చేశాడు. పసుపు నూర్పిళ్ల పనులకు వెదురూరు మహిళా కూలీలు వెళ్లారు. పనులు చేస్తున్న క్రమంలో సాయంత్రం 4.30గంటలకు భారీ వర్షంతో పెనుగాలులు వీచాయి. వీటి ధాటికి తట్టుకోలేక సమీపంలోని షెడ్డులోకి కూలీలందరూ వచ్చారు. వీరిలో ఖాసీంబీ, అయీషాలతో పాటు ముబీన్, శశి అనే కూలీలు వస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో ఆయీషాపై పిడుగు పడింది. దీని ధాటికి ఆయీషాతో పాటు పక్కనే ఉన్న తల్లి ఖాసీంబీ అక్కడికక్కడే మృతి చెందగా, ముబీన్, శశిలు స్పృహ తప్పి పడిపోయారు. అప్పటికే ఘటన గుర్తించి మిగిలిన కూలీలు సంఘటన స్థలంలోకి వెళ్లి స్పృహ తప్పిన వారికి సహాయక చర్యలు అందించారు. విషయం తెలుసుకున్న వెదురూరు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఖాసీంబీ భర్త కుటుంబ పోషణలో నిర్లక్ష్యంగా ఉండటంతో తల్లి కూతుళ్లే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఖాసీంబీకీ మాబుషరీష్(12), మహబూబ్‌బాషా(8) అనే కుమారులు ఉన్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, తహసీల్దారు, పోలీసులు పిడుగు పాటుకు గురై తల్లికూతుళ్లు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు తహసీల్దారు పార్వతి, రూరల్ సీఐ హనుమంత్‌నాయక్‌లు స్పందిం చి సహాయక చర్యలు అందించారు. ఘటనపై విచారణ జరిపి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అధికారులకు సూచించారు. -
పిడుగుపాటుతో ఆరుగురు దుర్మరణం
వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఆరుగురు మృత్యు ఒడికి చేరారు. తర్లుపాడు మండలం గానుగపెంటలో అత్తాకోడళ్లు, మార్కాపురం మండలం వేములకోటలో ఒక యువకుడు, మర్రిపూడి మండలం సిద్దారెడ్డిపల్లెలో ఓ యువరైతు, నాగులుప్పలపాడు మండలం చవటపాలెంలో మరో యువకుడు, వలేటివారిపాలెం మండలం కూనీపాలెంలో మరో మహిళ పిడుగుల బారినపడి తనువు చాలించారు. అత్తాకోడళ్లు మృతి గానుగపెంట (తర్లుపాడు) : పిడుగుపడి అత్తాకోడళ్లు మృతి చెందిన సంఘటన ఆదివారం గానుగపెంటలో జరిగింది. ఈ ప్రమాదంలో గానుగపెంటకు చెందిన అత్తాకోడళ్లు లింగాల వెంకట సుబ్బమ్మ (65), లింగాల వెంకట రమణ (35) మృతి చెందారు. గ్రామ సమీపంలోని పొలంలో పత్తి తీసేందుకు కూలీలతో పాటు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడడంతో తల దాచుకునేందుకు సమీపంలోని చింత చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడటంతో అత్తాకోడళ్లు అక్కడికక్కడే మరణించారు. తాడివారిపల్లె ఎస్సై ఎస్.వి.రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. జిల్లా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి బాల నాగయ్య మృతదేహాలను పరిశీలించారు. వేములకోటలో.. మార్కాపురం : పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం మార్కాపురం మండలంలోని వేములకోట పొలాల్లో జరిగింది. వేములకోటకు చెందిన రైతు తన పొలంలో వ్యవసాయ బోరు వేయించుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. బోరు మిషన్ వద్ద పనిచేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతుల్లా జిల్లా టెడ్డార్ గ్రామానికి చెందిన సతీష్ కుమార్ (24)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. మార్కాపురం రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పశువులు మేపుకొంటుండగా.. వలేటివారిపాలెం : పిడుగుపాటుతో మహిళ మృతి చెందిన సంఘటన కూనీపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన జాగర్లమూడి శంకరమ్మ (43) పశువులు కాసుకోవడానికి పొలానికి వెళ్లి పిడుగు పడటంతో మరణించింది. సాయంత్రమైనా శంకరమ్మ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మృతి చెందిఉంది. నాగులుప్పలపాడు మండలం చవటపాలేనికి చెందిన కొమ్ము మరియదాసు (27) కూడా పిడుగుపాటుకు మృతి చెందారు. ప్రభుత్వానికి నివేదిక ఒంగోలు టౌన్ : జిల్లాలో పిడుగుపాటు మృతుల వివరాలను యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ప్రాథమికంగా ఆరుగురు మరణించినట్లు నిర్ధారించారు. ఇప్పటివరకు మూడు గేదెలు కూడా మృత్యువాతకు గురైనట్లు నివేదికలో పొందుపరిచారు. యువ రైతు మరణం.. సిద్దారెడ్డిపల్లె (మర్రిపూడి) : పిడుగుపాటుతో యువ రైతు మృతి చెందిన సంఘటన సిద్దారెడ్డిపల్లెలో ఆది వారం జరిగింది. సిద్దారెడ్డిపల్లెకు చెందిన యువరైతు దుద్దుకుంట చెన్నారెడ్డి (34) తన భూమిలో వరి నారు పోసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చెన్నారెడ్డి వరి నాటుకోవాలనే ఆలోచనతో పొలాన్ని దమ్ము చేసుకొనేందుకు తూర్పువైపున ఉన్న మాగాణి భూమిలోకి వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపడి చెన్నారెడ్డి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.