Chilli crop farmers
-
ఆర్గానిక్ పద్ధతిలో మిరప సాగు...!
-
మిర్చి మిలమిల.. కలిసొచ్చిన సాగు!
కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి పంట రైతులకు లాభాలను తెచ్చి పెడుతోంది. జిల్లాలో సాధారణ సాగు 50,395 ఎకరాలు ఉండగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా 1,26,215 ఎకరాల్లో సాగైంది. గోనెగండ్ల, ఆలూరు, హాలహర్వి, మంత్రాలయం, కోసిగి, హొళగుంద, దేవనకొండ, పెద్దకడుబూరు, ఆస్పరి, సి.బెళగల్, కల్లూరు, చిప్పగిరి తదితర మండలాల్లో సాగు ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు రెండు కోతలు పూర్తి అయ్యాయి. మరో రెండు కోతలు వచ్చే అవకాశం ఉంది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల్లో నేలపై ఎర్ర తివాచీ పరిచినట్లు మిరప దిగుబడులు మిలమిల మెరుస్తున్నాయి. రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు పెట్టుబడి మిర్చి సాగులోఎకరాకు రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. సగటున 25 క్వింటాళ్ల ప్రకారం దిగుబడులు వస్తున్నాయి. జిల్లాలో పండించిన మిర్చి 90 శాతం గుంటూరు మార్కెట్‌కు వెళ్తోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడికి ఎక్కువ తెలంగాణ రైతులు తెస్తున్నారు. కర్నూలు మార్కెట్‌కు నాణ్యత పరంగా మొదటి రకాలు రాకపోయినా ఈ ఏడాది క్వింటాకు గరిష్టంగా రూ.39 వేల వరకు ధర లభించింది. జిల్లాలో ఎక్కువగా బ్యాడిగ, సింజెంట, ఆర్మూర్, తేజ, సూపర్ డీలక్స్, దేవనూరు డీలక్స్ వంటి రకాలు సాగు చేస్తున్నారు. ఈ రకాలతో పండించిన మిర్చితో నాణ్యత ఎక్కువగా ఉంటుంది. దీంతో సగటున క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ధర లభిస్తోంది. గతేడాది మిర్చి పంటను నల్ల తామర కొంత వరకు దెబ్బతీసింది. ఈ ఏడాది దీని ప్రభావం అంతగా లేదు. ‘డ్రిప్’ సదుపాయం జిల్లాలో ఈ ఏడాది 10వేల ఎకరాలకు సూక్ష్మ సేద్యం సదుపాయం కల్పించారు. అత్యధికంగా మిర్చికే డ్రిప్ సదుపాయం కల్పించడం విశేషం. దీంతో దిగుబడులు నాణ్యతతో వచ్చాయి. నీటి సదుపాయంతో సాగు చేసిన పొలాల్లో రికార్డు స్థాయిలో 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొందరు రైతులు మిర్చిని ఏసీ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. కలిసొచ్చిన సాగు గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామ వాసి అయిన గిడ్డయ్య... 20 ఏళ్లుగా ఎండిమిర్చి సాగు చేస్తున్నాడు. గతేడాది ఎకరాకు 30 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. దానిని కొంత రూ.21వేల ప్రకారం, మరికొంత రూ.30వేల ప్రకారం విక్రయించాడు. ఈ ఏడాది మూడు ఎకరాల్లో సాగు చేశాడు. ఇప్పటికే రెండు సార్లు కోత కోశాడు. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టగా దిగుబడి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు వస్తోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్లో మిర్చి క్వింటా ధర రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ధర పలుకుతోంది. మిర్చి సాగు బాగా కలసి రావడంతో గిడ్డయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కష్టానికి తగిన ఫలితం శ్రీనివాసరెడ్డి. గోనెగండ్ల మండలం కలుమూల గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్‌రెడ్డి. ఈ ఏడాది 1.50 ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటి వరకు రెండు కోతలు కోశాడు. మొదటి కోతలో 8 క్వింటాళ్లు రాగా క్వింటా రూ.21వేల ప్రకారం విక్రయించాడు. రెండో కోతలో 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 20వేల ప్రకారం అమ్మాడు. ఇంకా రెండు కోతలకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో ధరలు ఉండడంతో కష్టానికి తగిన ఫలితం వచ్చిందని ఈ రైతు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సారి చీడపీడల సమస్యలు లేవు జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు భారీగా పెరిగింది. అధిక దిగుబడులు, తెగుళ్లను తట్టుకునే రకాలు అనేకం మార్కెట్లోకి వచ్చాయి. గతేడాది మిర్చి పంటను నల్ల తామర దెబ్బతీసింది. ఈ సారి నల్ల తామర నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. గతేడాదితో పోలిస్తే ఈ సారి చీడపీడల సమస్యలు అంతగా లేవు. దీంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. మిర్చికి గిట్టుబాటు ధరలు లభిస్తుండటం రైతులకు ఊరటనిస్తోంది. – రామాంజనేయులు, జిల్లా ఉద్యానాధికారి, కర్నూలు -
పోగొట్టుకున్న చోటనే వెతకాలి..!
సాక్షి, మహబూబాబాద్: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎర్రబంగారం పండిస్తే సిరులు కురుస్తాయని ఆశపడి మిర్చి సాగు చేసిన రైతులకు తామర పురుగు, నల్లిపురుగు, పేను బంక పురుగు చుక్కలు చూపించాయి. దుక్కి దున్నడం నుంచి ఏపుగా పెరిగి.. కాత, పూత సమయంలో ఈ మాయదారి పురుగు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 70 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు నష్టాల పాలయ్యారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది మిరప పూతకు ఆశించిన తామర పురుగు(ఫైల్) తగ్గేదేలే అంటూ మిర్చి సాగు.. గత ఏడాది మిర్చి పంట సాగుచేసి నష్టపోయినా.. రైతులు మాత్రం తగ్గేదే లేదు అన్నట్లు మళ్లీ ఈ ఏడాది కూడా అదే పంట సాగుచేసేందుకు పోటీ పడుతున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,88,182 ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,03,537 ఎకరాల్లో సాగుచేయగా.. మహబూబాబాద్ జిల్లాలో 82,434 ఎకరాలు, జోగుళాంబ గద్వాలలో 35,309, భద్రాద్రి కొత్తగూడెంలో 32,375, జయశంకర్ భూపాలపల్లిలో 30,499 ఎకరాలు సాగుచేశారు. గత ఏడాది నష్టాలను చూసిన అధికారులు.. ఈ ఏడాది మిర్చి సాగుచేసే వారు పెద్దగా ఉండరని భావించారు. కానీ వారి అంచనాలు తారుమారు చేసి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా, మహబూబాబాద్‌లో 70 వేల ఎకరాలకు పైగా, భద్రాద్రి కొత్తగూడెంలో 28 వేల ఎకరాలపైగా సాగుచేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల ఎకరాలకు పైగా సాగుచేశారని, ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 2 లక్షలు నష్టం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన రైతు సోమిరెడ్డి లక్ష్మయ్య గత ఏడాది ఎకరం భూమిలో మిర్చి సాగు చేశాడు. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంటకు వైరస్ సోకింది. అనేక మందులను పిచికారీ చేశాడు. అయినా ఫలితం దక్కలేదు. పెట్టుబడితోపాటు భార్యాభర్తల కష్టం సైతం నేలపాలైంది. ఇతర పంటలు వేస్తే కలిసి రాదనే భావనతో లక్ష్మయ్య ఈ ఏడాది కూడా మిర్చి పంట వేశాడు. ఇప్పటివరకు రూ.70వేలు ఖర్చు చేశాడు. తోటలో అక్కడక్కడా బొబ్బరోగం కనిపిస్తోంది. తామర పురుగు కూడా ఆశిస్తే పెట్టుబడి అప్పులు కుప్పలుగా పేరుకుపోయే ప్రమాదం ఉంది. సాఫీగా పంట పండితే అప్పులు తీరుతాయని లక్ష్మయ్య చెప్పాడు. వేరే పంట వేయలేక.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన రైతు మడికంటి శ్రీను గత ఏడాది మూడు ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. రూ.మూడు లక్షల పెట్టుబడి పెట్టాడు. కానీ మూడు క్వింటాళ్ల మిర్చికూడా పండలేదు. దీంతో చేసిన కష్టంపోగా పెట్టుబడి అప్పుగానే మిగిలింది. ‘వేరే పంట వేయలేక.. నష్టపోయిన మిర్చి పంటవేసి పోగొట్టుకున్న చోటనే వెతకాలి.. తాడోపేడో.. తేల్చుకునేందుకు ఈ ఏడాది కూడా మూడెకరాల్లో మిర్చి పంట వేశా’నని శ్రీను చెప్పాడు. జాగ్రత్తలు పాటిస్తే పంటను రక్షించుకోవచ్చు మిరప పంటను ఆశించే నల్లతామర పురుగుకు మందులేదు. కానీ జాగ్రత్తలు పాటించి, సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను రక్షించుకోవచ్చు. పంట చుట్టూ జొన్న, సజ్జ పంటలు రెండు మూడు వరుసల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి వాడొద్దు. నీలిరంగు జిగురు అట్టలు ఎకరాకు 40 చొప్పున పెట్టుకోవాలి. వేపనూనె, కానుగ నూనె, పలుసార్లు పిచికారీ చేయాలి. జీవ నియంత్రణ కారకాలు, భవేరియా బాసియానా లేదా లెకానిసీలియం లెకానీని తగిన మోతాదుల్లో స్ప్రే చేయాలి. తామర పురుగు నివారణకు వాడే పురుగు మందులు ఒకే మందును పలుమార్లు కొట్టొద్దు. ఎప్పటికప్పుడు మందు మార్చాలి. నాటిన 15వ రోజు, 45వ రోజున ఫిప్రోనిల్ గుళికలను వేయాలి. – కె.భాస్కర్, ఉద్యాన శాస్త్రవేత్త, (జేవీఆర్ ఉద్యాన పరిశోధనా కేంద్రం, మల్యాల) ఇదీ చదవండి: తెలంగాణలో ‘స్పినోడాన్’ శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు -
కత్తులు దూసిన నకిలీ విత్తులు
► నాసిరకం విత్తనాల బారిన పడి ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య... ► మొక్క పెరిగినా పూత, పిందె రాక అన్నదాతల తీవ్ర ఆందోళన ► రాష్ట్రంలో ఇద్దరు మిర్చి రైతుల ఆత్మహత్య ► పంట రాక, అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణం ► మొక్క పెరిగినా పూత, పిందె రాక రైతన్నల మనోవేదన.. అప్పులు తీర్చలేక బలవన్మరణం ► అధికార నేతలు, అనుచరులదే పాపం.. గతేడాది మిర్చికి మంచి ధర రావడంతో సాగుపై పెరిగిన ఆసక్తి ► రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకున్న నేతలు.. కృత్రిమ కొరతతో ధర పెంపు ► గుంటూరు జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి అనుచరుగణాలదే ‘నకిలీ’ విత్తనాల దందా! ► ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు.. బాధ్యులపై చర్యలకు వెనుకాడుతున్న రాష్ర్ట సర్కారు సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తనాలు కత్తులు దూస్తున్నాయి. రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. మొక్క ఏపుగా పెరిగినా పూత, పిందె రాక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. పంట చేతికి వచ్చే అవకాశం లేక, పెట్టుబడుల కోసం రూ.లక్షల్లో చేసిన అప్పులను తీర్చే మార్గం కనిపించక బలబన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నకిలీ మిరప విత్తనాల కాటుకు ఇద్దరు యువ రైతులు బలైపోయారు. మిర్చిని సాగుచేస్తున్న కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ ఏడాది మిర్చి పట్ల రైతులకున్న ఆసక్తిని పసిగట్టిన అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ముందుగానే రంగంలోకి దిగారు. రైతులకు నకిలీ విత్తనాలను అధిక ధరలకు అంటగట్టి జేబులు నింపుకున్నారు. నకిలీ విత్తనాల వల్ల రైతాంగం నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాల్సింది పోయి తూతూమంత్రంగా అరెస్టులు చేసి చేతులు దులుపుకుంటోంది. 1,35,800 హెక్టార్లలో సాగు... గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో 1,35,800 హెక్టార్లలో మిర్చి సాగవుతోంది. గతేడాది మిర్చికి మంచి ధర రావడంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతులు ఎకరాకు రు.20 వేలు చెల్లించి, కౌలుకు తీసుకుని మరీ సాగు చేస్తున్నారు. విజయనగరంలో 196 హెక్టార్లు, విశాఖలో 205, తూర్పుగోదావరిలో 1,045, పశ్చిమ గోదావరిలో 208, కృష్ణాలో 16,132, గుంటూరులో 70,005, ప్రకాశంలో 21,432, కర్నూలులో 22,566, అనంతపురంలో 3,145, వైఎస్సార్ జిల్లాలో 864 హెక్టార్లలో మిర్చిని సాగు చేస్తున్నారు. గతేడాది లాభాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఒక్కసారిగా మిర్చి వైపు మొగ్గు చూపడంతో అధికార పార్టీ ముఖ్య నేతల అనుచరుల దృష్టి ఈ వ్యాపారంపై పడింది. విత్తనాల విక్రయాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించారు. ధరను అమాంతం పెంచేశారు. డిమాండ్ అధికంగా ఉండడంతో నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించారు. రూ.30 వేల ధర ఉన్న కిలో మిరప విత్తనాలను రూ.80 వేలకు విక్రయించారంటే అన్నదాతలను ఏ స్థాయిలో దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మంత్రి ప్రత్తిపాటికి తెలిసే జరిగిందా? నకిలీ మిరప విత్తనాల వ్యవహారం వెనుక సాక్షాత్తూ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉండడం వల్లే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలోని నకిలీ విత్తన కంపెనీల గుట్టుమట్లు మంత్రికి తెలుసని, ప్రముఖ విత్తన సంస్థల పేరిట నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిలో మంత్రి అనుచరులు కూడా ఉన్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. నకిలీ విత్తనాలమ్మిన ఓ కంపెనీ యజమాని మంత్రి ప్రత్తిపాటికి అత్యంత సన్నిహితుడని జిల్లాలో ప్రచారం సాగుతోంది. నకిలీ విత్తనాల బాగోతంలో ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు ముట్టడం వల్లే బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విత్తన ధ్రువీకరణ సంస్థ ఏం చేస్తున్నట్లు? విత్తనాల నాణ్యతను ధ్రువీకరించేందుకు రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ ఉంది. ఇక్కడ ధ్రువీకరించిన విత్తనాలనే మార్కెట్లో విక్రయించాలి. అయినా విత్తనాల వ్యాపారుల ముసుగులో నేతల అనుచరులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఎలాంటి ధ్రువీకరణ, అనుమతులు లేకుండానే మిరప విత్తనాలను రైతులకు అంటగట్టారు. రూ.30 వేల పరిహారం ఇప్పించాలి గుంటూరు జిల్లా కోటప్పకొండ ప్రాంతంలో గతంలో నకిలీ విత్తనాల వల్ల రైతులు పంట నష్టపోయినప్పుడు అదే జిల్లాకే చెందిన తులసీ సీడ్స్ నుంచి ఎకరాకు రూ.20 వేల వరకు అప్పటి ప్రభుత్వం పరిహారం ఇప్పించింది. ఇప్పుడా మొత్తాన్ని రూ.30 వేలకు పెంచి రైతులకు ఇప్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రత్యామ్నాయ పంట వేసుకునేందుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని కోరుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని సూచిస్తున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మితే జైల్లో పెట్టాలి రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులను కల్తీ చేస్తున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలపై నియంత్రణ ఉండాలని, నకిలీ విత్తనాలు అమ్మేవారికి భారీగా జరిమానాలు విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపాదిత విత్తన చట్టంలో పేర్కొన్న ప్రకారం బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని, సంబంధిత నకిలీ కంపెనీ నిర్వాహకులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇద్దరు మిర్చి రైతుల ఆత్మహత్య నకిలీ విత్తనాల బారినపడ్డ ఇద్దరు యువ రైతులు ఇటీవల కన్నుమూశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం ఎలవర్తిపాడుకు చెందిన ఎర్రసాని విజయ్ మిరప తోటలోనే పురుగు మందు తాగి చనిపోయాడు. కర్నూలు జిల్లా ప్యాపిలిలో రాయుడు అనే మిర్చి రైతు కూడా క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించాడు.