China Eastern Airlines
-
చైనా స్వదేశీ విమానం సక్సెస్
బీజింగ్: చైనా మొట్టమొదటి సారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల విమానం సీ919 ఆదివారం విజయవంతంగా ప్రయాణించింది. విమానయాన రంగం మార్కెట్లోకి డ్రాగన్ దేశం అధికారికంగా ప్రవేశించింది. పశ్చిమదేశాలకు చెందిన బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలతో పోటీ పడేలా చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాన్ని తయారు చేసింది. తొలిసారిగా షాంఘై నుంచి బీజింగ్‌కు వెళ్లిన ఈ విమానం రెండున్నర గంటల్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. -
రెండు విమానాలు ఢీకొంటే అంతే మరి!
చైనా: సాధారణంగా మనం కారు రివర్స్‌లో పెడుతున్నా.. లేదా బ్రేక్ ఆగక ముందు వెళ్లే వాహనానికి మెల్లగా తాటించిన గబాళ్లు మని శబ్దం రావడంతోపాటు రెండు వాహనాలకు భారీ సొట్టలు పడతాయి.. అలాంటిది రెండు విమానాలు ఒక దానికి మరొకటి తాగిలితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదే ఘటన షాంఘైలోని హంకియో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ రెండు విమానాలు కూడా చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్యాసింజర్ విమానాలే. ఒక విమానం తన ప్రయాణం ముగించుకుని సురక్షితంగా దిగి టర్మినల్ వద్దకు వస్తుండగా మరో విమానం ప్రయాణీకులను ఎక్కించుకుని బయలుదేరేందుకు రన్ వే వైపు కదిలేందుకు సిద్ధమై కదిలింది. ఇంతలో పెద్ద శబ్ధం.. చూస్తూండగానే వాటి రెక్కలు ఒకదానికి మరొకటి తగిలి అందులో ఓ విమానం రెక్క అమాంతం సగానికి పైగా చీలిపోయింది. ఏంజరుగుతుందా అని రెండు విమానాల్లో ప్రయాణీకులు అదిరిపడ్డారు. వెంటనే వాటిని పైలెట్లు ఆపేశారు. రెండు విమానాల్లోని ప్రయాణీకులను దించివేసి ఎయిర్ పోర్టుకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. కొంత ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన ఎలా జరిగిందో విచారించేందుకు అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.