China economy
-
అమ్మకాలను కట్టడి చేసేందుకే చైనా కఠిన నిర్ణయాలు..
స్టాక్మార్కెట్లో ఒడిదొడుకులు సహజం. ఏదైనా అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు మరింత ఎక్కువగా ఊగిసలాడుతాయి. అయితే మార్కెట్లో నిత్యం భారీగా అమ్మకాలపర్వం కొనసాగితే ఆ దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం జరుగుతుంది. దాంతో ఎక్స్ఛేంజ్ రెగ్యులేటరీలు కొత్త నిబంధనలు తీసుకొస్తాయి. ఫలితంగా కొంత నష్టాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటాయి. తాజాగా చైనా మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు స్టాక్ మార్కెట్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చైనా వరుస అమ్మకాల ఒత్తిడిని కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కొవిడ్ అనంతరం అక్కడి మార్కెట్ వెళ్లిన జీవనకాల గరిష్ఠాల నుంచి క్రమంగా చైనా, హాంకాంగ్ మార్కెట్లలో ఆరు ట్రిలియన్ డాలర్ల సంపదను మదుపర్లు విక్రయించి దేశానికి షాక్ ఇచ్చారు. ఈ తరుణంలో దేశంలోని ఆర్థిక నిపుణులు సలహా మేరకు అక్కడి మార్కెట్ రెగ్యులేటర్లు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాయి. ఇందులో భాగంగా చైనా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. షార్ట్ సెల్లింగ్‌కు సంబంధించి ‘చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ (సీఎస్ఆర్సీ)’ పరిమితులు విధించింది. ఈ నిబంధనలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ‘రెస్ట్రిక్టెడ్ స్టాక్స్’ లిస్ట్‌లో ఉన్న షేర్లను ఇతరులకు అప్పుగా ఇచ్చేలా గతంలో ఉన్న నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు సీఎస్ఆర్సీ తెలిపింది. దీనిపై మరిన్ని షరతులను మార్చి మూడోవారంలో తెలియజేయనున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: అమెరికా వార్నింగ్ ఇచ్చినా ఒకేసారి మూడు ఉపగ్రహాలు ప్రయోగించిన దేశం..! చైనా వృద్ధి రేటు చాలా ఏళ్లపాటు నెమ్మదిగా ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఆ దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించిన స్థిరాస్తి రంగం ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిసింది. అక్కడి స్టాక్ మార్కెట్ మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా పటిష్ట పరుచుకోవాలని భావించిన ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. -
25 ఏళ్లలో తొలిసారి.. చైనాలో ఏం జరుగుతుందంటే.. నివేదికలో ఆసక్తికర అంశాలు
ప్రపంచ కర్మాగారమని చెప్పుకునే చైనా కథ కీలకమైన మలుపు తిరిగిందా? ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెలాయిస్తున్న పెత్తనానికి బ్రేకులు పడనున్నాయా? అవునంటున్నాయి తాజా నివేదికలు. పాతికేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తొలిసారి తగ్గుముఖం పట్టడాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా విదేశీ పెట్టుబడులు తగ్గిన సమాచారం బయటకొచ్చింది. 1998 తరువాత మొట్టమొదటిసారి 2023 మూడో త్రైమాసికంలో చైనాలోని విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.98 కోట్ల వరకూ తగ్గినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ యాజమాన్య సంస్థల నుంచి డబ్బు ఇతర దేశాలకు ప్రవహించడం మొదలైంది. చైనాలోని విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గడానికి పశ్చిమ దేశాలతో ఆ దేశ సంబంధాలు బెడిసికొట్టడం, ఇతర దేశాల్లో అధిక వడ్డీ రేట్లు కారణంగా ఎఫ్‌డీఐలు తరలిపోతున్నట్లు నివేదిక తెలిపింది. అమెరికాతోపాటు ఇతర దేశాలకు చెందిన సెంట్రల్బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. అందుకు విరుద్ధంగా మందగిస్తున్న తన ఆర్థిక వ్యవస్థను పెంచడానికి చైనా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో చైనాలో కంటే వడ్డీ ఎక్కువగా ఉన్న ఇతర దేశాల్లోకి పెట్టుబడులు పెట్టడంతో లాభం చేకూరుతుందని విదేశీ పెట్టుబడిదారులు యోచిస్తున్నారు. ఫలితంగా చైనాలో ఎఫ్‌డీఐలు తగ్గిపోతున్నాయి. అయితే గతంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్న సమయంలో విదేశీ కంపెనీలు చైనాలో ఆర్జించిన లాభాలను దేశంలో తిరిగి పెట్టుబడి పెట్టేందుకు సుముఖత చూపలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దాంతో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందన్నారు. ఈ సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 920 బిలియన్ యువాన్లకు (రూ.10లక్షల కోట్లు) చేరుకున్నాయి. ఇది 2022లో ఇదే కాలంతో పోలిస్తే 8.4 శాతం తక్కువ. ఈ ఏడాది యూఎస్ డాలర్‌తో పోలిస్తే చైనా కరెన్సీ విలువ క్షీణించింది. పెరుగుతున్న నిరుద్యోగం, రియల్ ఎస్టేట్ సంక్షోభం కారణంగా డిమాండ్ మందగించడంతో చైనా ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడినట్లు సర్వే తెలిపింది. చైనాలోని రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ ఎవర్‌గ్రాండే ఈ సంవత్సరం ప్రారంభంలో దివాలా కోసం దాఖలు చేసింది. ప్రస్తుతం మరో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ కంట్రీ గార్డెన్ పతనం అంచున ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతి ఆధారిత, పారిశ్రామిక రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీల లాభాలు ఈ ఏడాది క్షీణించాయని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: నోట్ల రద్దు తర్వాత రెట్టింపైన నగదు చలామణి! కారణం ఇదేనా.. చైనా బ్యాంకింగ్ రంగంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు 2021లో రికార్డు స్థాయిలో 4 ట్రిలియన్ యువాన్లు ఉండేవి. అయితే సెప్టెంబర్ చివరి నాటికి 3.19 ట్రిలియన్ యువాన్లకు పడిపోయాయని చైనా సెంట్రల్ బ్యాంక్ డేటాను ఉటంకిస్తూ సర్వే తెలిపింది. ఐఎంఎఫ్ తన తాజా అంచనా నివేదికలో ప్రాపర్టీ సెక్టార్లో కొనసాగుతున్న బలహీనత, మార్కెట్లో డిమాండ్ తగ్గుదల కారణంగా చైనా వాస్తవ జీడీపీ 2023లో 5.4 శాతానికి పెరుగుతుందని, 2024లో 4.6 శాతానికి మందగించవచ్చని చెప్పింది. అక్కడి జనాభా అధికంగా వృద్ధాప్యంతో బాధపడుతుండడంతో పరిశ్రమల్లో ఉత్పాదకత తగ్గి 2028 నాటికి వృద్ధిరేటు క్రమంగా 3.5 శాతానికి పడిపోతుందని అంచనా. -
రియల్ ఎస్టేట్ కంపెనీలతో చైనా ఆర్థిక వ్యవస్థకు తంటాలు!
చైనా ఆర్థిక పరిస్థితి సరిగా లేదనే వార్తలు ఈమధ్య ఎక్కువగానే అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ చైనా ‘ప్రపంచానికి ఫ్యాక్టరీ’ అనే ప్రశంసలు అందుకుంది. 2019 చివరిలో వేగంగా ప్రయాణం మొదలెట్టిన మహమ్మారి కొవిడ్–19 దెబ్బతో చైనా ఎదురులేని ఆర్థికాభివృద్ధి తగ్గుముఖం పట్టడం మొదలైంది. 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను లక్ష్యంగా చేసుకుని విధించిన అదనపు దిగుమతి సుంకాలు చైనాపై వ్యతిరేక ప్రభావం చూపించడం ఆరంభమైంది. ‘ప్రపంచ వర్క్‌షాప్’ అనే పేరు నెమ్మదిగా కోల్పోయే పరిస్థితులు చైనా కళ్ల ముందు కదలాడుతున్నాయి. అప్పటి వరకూ తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనాలో కొనసాగిస్తున్న కొన్ని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇతర దేశాల్లో ఆ పనిని చేయించడం ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలైన యాపిల్, శామ్సంగ్ తమ కార్యకలాపాల్లో కొంత భాగాన్ని 2022లో మరో ఆసియా దేశం వియత్నాంకు తరలించాయి. పిల్లల బొమ్మల తయారీ కంపెనీ హాస్బరో 2019లోనే తన ఉత్పత్తి పనులను మెక్సికో, అమెరికా, ఇండియా, వియత్నాంకు తరలించింది. తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో రిస్కును తగ్గించుకోవడానికే చైనాను ఈ కంపెనీలు వదిలిపోయాయని అంతర్జాతీయ వాణిజ్యంలో పరిణామాలను అధ్యయనం చేసే మూడీస్ అనలిటిక్స్ ఆర్థికవేత్త మార్క్ హాప్కిన్స్ అభిప్రాయపడ్డారు. అంతేగాక, అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు తగ్గుముఖం పట్టిన ఫలితంగా ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా లబ్ధిపొందుతున్నాయి. ఇప్పుడు ఇతర అనేక సమస్యలు చైనా ఆర్థిక వ్యవస్థను మున్నెన్నడూ లేనంతగా పీడిస్తున్నాయి. జనాభా తగ్గడం, రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభంతో ఆందోళనకర పరిణామాలు గత మూడు దశాబ్దాల్లో చైనా జనాభా బాగా పెరిగింది. ఉపాధి, ఆర్థిక అవకాశాల కోసం చైనీయులు పెద్ద సంఖ్యలో నగరాల బాట పట్టారు. ఆరంభంలో వారి కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్లు వేగంగా ఆధునిక అపార్ట్ మెంట్లు నిర్మించలేకపోయారు. అనేక కంపెనీలు ఈ స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించి నిర్మాణ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగించాయి. రియల్ ఎస్టేట్ రంగం చైనా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఇంజన్ మాదిరిగా ఉపయోగపడింది. స్థిరాస్తి రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. అనేక కుటుంబాలు పొదుపు చేసుకుని మదుపు చేయడానికి ఈ రంగం గొప్ప అవకాశం కల్పించింది. ఇలా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం సైజు చైనాలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాల్లో నాలుగో వంతుకు చేరింది. ఇక ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందనుకున్న స్థిరాస్తి రంగంపై చైనా ఆధారపడడం ఎక్కువైంది. కాని, తర్వాత ప్రజల అవసరాలకు మించిన సంఖ్యలో గృహాల నిర్మాణం, అందుకోసం శక్తికి మించిన మొత్తాల్లో గృహనిర్మాణ కంపెనీలు అప్పులు చేయడంతో ఒక్కసారిగా కథ మారిపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు సాగుతున్నంత వరకూ ఈ కంపెనీలు తేలికగా తమకు లభ్యమైన రుణాలతో చెల్లింపులు జరిపాయి. ఇప్పుడు ఇళ్లకు గిరాకీ తగ్గడంతో కంపెనీలకు అప్పులు పుట్టడం లేదు. పాత అప్పులు తీర్చలేకపోతున్నాయి. అన్ని సమస్యలకూ కొవిడ్–19 వల్ల ఎడాపెడా పెట్టిన లాక్ డౌన్లే కారణమని జనం నిందించే పరిస్థితి వచ్చింది. అలాగే, అన్ని ఇబ్బందులకూ కారణం రియల్ ఎస్టేట్ రంగమేనని ఇప్పుడు మరి కొందరు తప్పుబడుతున్నారు. ఈ ఆగస్టులో కంట్రీ గార్డెన్ వంటి 50కి పైగా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్ణీత సమయంలో చెల్లింపులు చేయలేక దివాలా స్థితికి చేరుకుంటున్నాయి. గత మూడేళ్లుగా ఈ సంక్షోభం ముదురుతోంది. ఈ ఏడాది జులైలో 100 చైనా అగ్రశ్రేణి రియల్టీ కంపెనీల అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 33% పడిపోయాయి. జూన్ లో 28 శాతం తగ్గిపోయాయని చైనా రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ అనే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, దివాలాకు సిద్ధమౌతున్న స్థిరాస్తి కంపెనీల సంఖ్య పెరుగుతున్నా చైనా ప్రభుత్వం ఈ రంగాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం లేదు. కేవలం, తనఖా నిబంధనలు సరళతరం చేయడం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి చర్యలకే పరిమితమైంది సర్కారు. ఇళ్ల ధరలు పెరుగుతున్నంత సేపూ భారీ అప్పులతో గృహాలు నిర్మించి అమ్ముకునే స్థిరాస్తిరంగం బాగుంటుందని, ఇబ్బందులు ఎదురైతే తట్టుకోలేదని చైనా మోడల్ నిరూపిస్తోంది. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
ఏప్రిల్–జూన్‌లో చైనా వృద్ధి 7.9 శాతం
బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన, వర్థమాన, పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా ప్రేరిత సవాళ్లను ఎదుర్కొంటుంటే, వైరెస్ సృష్టికి కారణమైన చైనా మాత్రం పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2021 రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లో 7.9 శాతం (2020 ఇదే కాలంతో పోల్చి) పురోగతి సాధించింది. మొదటి త్రైమాసికం (జనవరి–మార్చి) 18.3 శాతం వృద్ధితో (1993లో చైనా జీడీపీ గణాంకాల ప్రచురణ ప్రారంభమైంది. అటు తర్వాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో వృద్ధి రేటు నమోదుకావడం అదే తొలిసారి) పోల్చితే తాజా గణాంకాలు మందగించడం గమనార్హం. ఏడాది తొలి ఆరు నెలల్లో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ– చైనా 12.7 శాతం వృద్ధి నమోదుచేసుకున్నట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) గురువారం గణాంకాలు వెల్లడించాయి. విలువలో ఎకానమీ 53.2 ట్రిలియన్ యువాన్లకు చేరింది. డాలర్లలో ఇది దాదాపు 8.23 ట్రిలియన్లు. కాగా త్రైమాసికంగా చూస్తే, మొదటి త్రైమాసికంకన్నా, రెండవ త్రైమాసికంలో వృద్ధి 1.3 శాతంగా ఉంది. గణాంకాల ప్రకారం వార్షికంగా పారిశ్రామిక ఉత్పత్తి 15.9 శాతం పెరిగితే, రిటైల్ విక్రయాలు 23 శాతం ఎగశాయి. పట్టణ నిరుద్యోగం జూన్‌లో 5 శాతంగా ఉంది. ప్రపంచం కష్టపడుతున్న సమయంలో... కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో 2020 తొలి త్రైమాసికం మినహా మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం. కరోనా సవాళ్లతో 2020 మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్ మధ్యా ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్ డాలర్లు) నమోదుచేసుకుంది. -
6.7శాతంగా చైనా జీడిపి
-
మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఏపీ
చైనా దెబ్బతినడంతో ప్రపంచం మన వైపు చూస్తోంది: సీఎం సాక్షి, అమరావతి : తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్)లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా తయారు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలో జరిగిన సీఐఐ సదరన్ రీజియన్ కౌన్సిల్ అంతర్గత సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో తయారీ రంగంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని, దీన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, పెట్రోకెమికల్స్, ఐవోటీ వంటి రంగాల్లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు వీటికి సంబంధించి విలువ ఆథారిత పరిశ్రమలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం సీఐఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయాడానికి స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఐ దక్షిణ రీజియన్ చైర్మన్ రమేష్ దాట్ల, సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శివకుమార్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 60 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కృష్ణా రివర్‌ఫ్రంట్ అభివృద్ధి: ప్రకాశం బ్యారేజీకి ఎగువన రాజధాని వైపు 32 కిలోమీటర్ల మేర కృష్ణా రివర్ ఫ్రంట్‌ను బ్లూ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి డిజైన్లు రూపొందించాలని సూచించారు. శనివారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. పట్టువస్త్రాలు సమర్పించిన బాబు దంపతులు విజయవాడలో రోజూ పండుగ వాతావరణ కనపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వచ్చే డిసెంబర్లో విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించాలని యోచిస్తున్నామని ప్రకటించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీకనకదుర్గమ్మ వారు శనివారం శ్రీసరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శనివారం అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, లాంఛనాలు సమర్పించారు. -
చైనాపై మరిన్ని ఆశలు
దేశీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు అండగా ఉంటామని క్రెడిట్ స్యూజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిడ్జానే థియం ప్రకటించారు. ఆసియా దేశాల అభివృద్ధి కోసం స్విస్ బ్యాంకు తీసుకున్న నిర్ణయంలో చైనా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం భాగమన్నారు. చైనాలో క్రెడిట్ స్యూజ్ కు మంచి సభ్యులు ఉన్నప్పటికీ ఎందుకో అక్కడి ఆర్థిక పరిస్థితుల్ని మార్చలేకపోయామని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిలో భాగంగా సంపదను వెలికి తీయడమే లక్ష్యంగా వెల్త్ మేనేజర్లు పని చేయాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంపద సృష్టించేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. ఐదు ఏళ్ల క్రితం 10 శాతంగా ఉన్న చైనా ఆర్థికవృద్ధి ఈ ఏడాది 6.5గా నిర్దేశించుకుందని, ఇది రెండు దశాబ్దాలకు తక్కువని చెప్పారు. 10 శాతం కంటే 6.5 శాతం తక్కువేమీ కాదని, యూరప్ దేశాల కంటే ఈ అభివృద్ధి ఎక్కువగానే ఉందని థియం పేర్కొన్నారు. ఐదు రోజుల చైనా పర్యటనలో భాగంగా పెట్టుబడుల అంశంపై స్యూజ్ కస్టమర్లను కలిసి థియం నిర్ణయం తీసుకోనున్నారు. చైనాలో సంపద సృష్టికి స్యూజ్ బ్యాంకు తప్పకుండా పెట్టుబడుల పెడుతుందని థియం చెప్పారు. -
చైనా మందగమనం భారత్‌కు మంచిదే..!
‘గ్రాంట్స్’కు సప్లిమెంటరీ డిమాండ్‌పై చర్చకు అరుణ్ జైట్లీ సమాధానం ♦ జీఎస్టీ అమలు ఆలస్యంపై ఆవేదన ♦ పీఎస్‌యూ బ్యాంకులకు రూ. 1.1 లక్ష కోట్లు అవసరం న్యూఢిల్లీ : చైనా ఆర్థిక వ్యవస్థ మందగమన ధోరణి భారత్ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదగడానికి దోహదపడే అంశమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1 నుంచి 2 శాతం వృద్ధికి దోహదపడే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ఆలస్యం కావడం పట్ల ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి గతవారం పార్లమెంటులో తన మొట్టమొదటి సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొత్తం దాదాపు రూ.25,500 కోట్లు. స్థూలంగా రూ.40,822 కోట్ల వ్యయాలకు అనుమతి కోరితే... పొదుపులు లేదా పెరిగిన వసూళ్లు, రికవరీలు అన్నీ (దాదాపు రూ.15,326 కోట్లు) పోనూ నికర నగదు వ్యయ డిమాండ్ రూ.25,500 కోట్లు. ఇందులో సగం బ్యాంకులకు తాజా మూలధన కేటాయింపులకు సంబంధించినదే కావడం గమనార్హం. దీనిపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన పేర్కొన్న అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి... ► పెట్టుబడుల పునరుద్ధరణ, నిలిచిపోయిన ప్రాజెక్టుల పునఃప్రారంభం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనం కేటాయింపులు వంటి పలు చర్యలను కేంద్రం తీసుకుంటోంది. తగిన వర్షపాతమూ నమోదయ్యే అవకాశం ఉంది. వీటిన్నింటి దన్నుతో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ► రానున్న ఐదేళ్లలో బ్యాంకులకు రూ.70,000 కోట్లు సమకూర్చాలన్నది కేంద్రం లక్ష్యం. రూ.1.10 లక్షల కోట్లను బ్యాంకులు మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ అకౌంట్ల నిరర్ధక ఆస్తుల్లో స్టీల్, విద్యుత్, రహదారుల రంగాలే మెజారిటీగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి సాధన క్రమంలో ఎన్పీఏల సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. ► జీఎస్టీ అమలుకు అన్ని పార్టీలూ సహకరించాలి. దీనివల్ల దేశ వ్యాప్తంగా పన్నుల వ్యవస్థలో ఏకరూపత వస్తుంది. వృద్ధి రేటు పెరగడానికి తోడ్పడుతుంది. ఇలాంటి విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరం. ► చైనాలో కంపెనీల వేతన బిల్లులు పెరిగిపోయాయి. దీనిని భరించాలంటే- ఆయా కంపెనీలు ఉత్పత్తిచేసే వస్తువుల ధరలు పెరగాలి. ఇలాంటి పరిస్థితిని భారత్ తనకు సానుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తయారీ రంగానికి భారత్ కేంద్రంగా పరిణతి చెందాలి. ఇదే జరిగితే భారత్ వృద్ధి మరింత జోరందుకుంటుంది. ► మనం 8 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం. రెవెన్యూ వసూళ్లు కూడా ఇందుకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలూ సానుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పరోక్ష పన్ను వసూళ్ల విభాగం బాగుంది. ► విదేశీ విభాగంలో ఆర్థిక అంశాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రికార్డు స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతం పెరిగాయి. కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణలో ఉంది. ► తగిన నిధుల లభ్యత వల్ల సామాజికాభివృద్ధి పథకాల్లో కూడా కేంద్రం నిధులను వెచ్చించగలుగుతుంది. ► బడ్జెట్ అంచనాలకు, సవరించిన అంచనాలకు పెద్దగా తేడా ఉండకుండా చూసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బడ్జెట్ అంచనాలకన్నా... సవరించిన అంచనాలు స్వల్ప స్థాయిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ► కొన్ని రాష్ట్రాల్లో ఆహార పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో సాగునీటి పారుదలపై మరింత వ్యయాలు పెంచాలి. ► 8 నుంచి 9 శాతం వృద్ధి సాధనలో రాష్ట్రాల పాత్రా కీలకం. వాటికి తగిన స్థాయిల్లో నిధులు అందజేస్తాం. ఏ రాష్ర్టం పట్లా పక్షపాత ధోరణి ఉండబోదు.