China mobile manufacturing company
-
చైనా కంపెనీ షావోమీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమీ ఇండియాకు ఈడీ షాకిచ్చింది. విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై రూ.5,551.27 కోట్ల విలువైన కంపెనీ నిధులను శనివారం జప్తు చేసింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘గత ఫిబ్రవరిలో రూ.5,551.27 కోట్ల విలువైన నిధులను సొంత గ్రూప్ కంపెనీతో పాటు మొత్తం మూడు విదేశీ కంపెనీలకు రాయల్టీ ముసుగులో పంపించింది. చైనాకు చెందిన తన మాతృసంస్థ షావోమీ ఆదేశాల మేరకే ఈ పని చేసింది. అంతిమంగా షివోమీ గ్రూప్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే రెండు యూఎస్ కంపెనీలకు కూడా నిధులు బదిలీ చేసింది’’ అని ఈడీ వివరించింది. ఇది కూడా చదవండి: అది కాళరాత్రి: జెలెన్స్కీ.. ఆయనపై ‘టైమ్’ కవర్ స్టోరీ -
మార్కెట్లోకి మరో కంపెనీ : బడ్జెట్ ధర, అద్భుత ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్స్ షావోమి, ఒప్పో, వివో, లెనోవో లాంటివి ఇప్పటికే భారత మొబైల్ మార్కెట్‌ను శాసిస్తుండగా, మరో చైనా మొబైల్ తయారీదారు భారతీయ కస్టమర్లపై దృష్టిపెట్టింది. తాజాగా చైనాకంపెనీ హామ్‌టామ్ దేశీయస్టార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది మిడ్ సెగ్మెంట్లో మూడు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో మూడు సంవత్సరాల వారంటీతోపాటు, రెండు సార్లు స్ర్కీన్ రీప్లేస్మెంట్ ఆఫర్కూడా అందిస్తోంది. హెచ్1, హెచ్ 3, హెచ్ 5 డివైస్‌లను విడుదల చేసింది. మొదటి ఆరు నెలల్లో స్మార్ట్‌ఫోన్ విఫణిలో మూడు నుండి ఐదు శాతం వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హోమ్టామ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టర్ నిఖిల్ భూటాని చెప్పారు. హెచ్1 స్మార్ట్‌ఫోన్: 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే , 18.9 యాస్పెక్ట్ రేషియో 640x1280 రిజల్యూషన్ 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 13+2 ఎంపీ డ్యుయల్ రియర్‌కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ధరః రూ .7,499, హెచ్3 స్మార్ట్‌ఫోన్: 5.5అంగుళాల హెచ్డీ డిస్ప్లే , 18.9 యాస్పెక్ట్ రేషియో, 720x1440 రిజల్యూషన్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఎంటీకే 1.3 గిగాహెడ్జ్ బిట్64 , 13+2 ఎంపీ డ్యుయల్ రియర్‌కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీని ప్రధాన ఫీచర్లు, ధర రూ .9,990 ఈ రెండు స్మార్ట్ఫోన్లలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అమర్చింది. హెచ్ 5 స్మార్ట్‌ఫోన్: 5.7 అంగుళాల హెచ్డీ డిస్ప్లే , 720x1440 రిజల్యూషన్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 16 + 2 రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్, ధర: రూ .10,990. ఈ మూడు స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేస్తాయి. -
భారత్‌లో ఒప్పొ ప్లాంట్
న్యూఢిల్లీ: ప్రముఖ చైనా మొబైల్ తయారీ కంపెనీ ఒప్పొ భారత్‌లో హ్యాండ్సెట్ అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీన్ని ఈ ఏడాది ఆగస్ట్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, ప్లాంట్ ఏర్పాటుకు ఇదే అనువైన సమయమని ఒప్పొ మొబైల్స్ ఇండియా సీఈఓ టామ్ లూ తెలిపారు. తమ మార్కెట్ ప్రాథామ్యాలలో భారత్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. తయారీ రంగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమ ప్రభావంతో షియోమీ, కూల్‌ప్యాడ్, జియోనీ వంటి కంపెనీలు కూడా దేశంలో ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించాయి. భారత్‌లో గతేడాది జనవరిలో కార్యకలాపాలను ప్రారంభించిన ఒప్పొ, ఇప్పటిదాకా 10 మోడ ళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పొ ఈ ఏడాది సర్వీస్ సెంటర్ల సంఖ్యను 120 నుంచి 200కు పెంచాలని, అలాగే మొబైల్ విక్రయాలను 15 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.