ట్రాన్స్స్ట్రాయ్లో చైనా కంపెనీకి వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ట్రాన్స్స్ట్రాయ్లో చైనా ప్రభుత్వ రంగ సంస్థ చైనా న్యూ ఎరా గ్రూప్ కార్పొరేషన్ వాటా కొనుగోలు చేస్తోంది. అయితే ఎంత వాటా కొనుగోలు చేసేది వెల్లడించలేదు. వాటా కింద చేసే పెట్టుబడి ‘కొన్ని వందల మిలియన్ డాలర్లు’ అని ఇరు కంపెనీలు ఆదివారం ప్రకటించాయి.