చైనాతో 24 ఒప్పందాలపై అంగీకారం
చైనా : చైనాలో ప్రధానమంత్రి నరేంద్ర మోఈ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చైనా ప్రధాని లీ కెషాంగ్తో మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపారు. సరిహద్దు సమస్య, భారత్లో పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన 24 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు.
తొలిరోజు పర్యటనలో భాగంగా మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయిన విషయం తెలిసిందే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇరుదేశాల మధ్య వ్యాపార,వాణిజ్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు.