china swamy stadium
-
బెంగళూరే ‘ఫైనల్’
ఐపీఎల్ పాలక మండలి స్పష్టీకరణ ముంబై: ఐపీఎల్-7 ఫైనల్ ఎక్కడ జరుగుతుందనే సస్పెన్స్‌కు తెర పడింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే జూన్ 1న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్నట్టు ఐపీఎల్ పాలక మండలి (జీసీ) ప్రకటించింది. వాస్తవానికి ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ జట్టు వేదికపై ఫైనల్ జరగడం ఆనవాయితీ. దీని ప్రకారం గతేడాది విజేత ముంబై ఇండియన్స్ వేదిక అయిన వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే జీసీ దీన్ని బెంగళూరుకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ముంబై క్రికెట్ సంఘ (ఎంసీఏ) తమ నిరసనను వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. దీనికి ప్రతిగా తమ షరతులు అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుందని లీగ్ చైర్మన్ రంజీబ్ బిశ్వాల్ ఎంసీఏకు లేఖ రాశారు. దీనికి వారు అంగీకరించినా శనివారం రాత్రి జరిగిన లీగ్ పాలక మండలి సమావేశంలో మాత్రం తాము ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడింది. ‘జీసీలో ఫైనల్ ఎక్కడ జరపాలనే దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎంసీఏ వినతిని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. అయితే చివరకు బెంగళూరే ఉత్తమమని ఏకగ్రీవంగా నిర్ణయించాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. -
దుమ్మురేపిన యువీ
బెంగళూరు: డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (35 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారానికి తోడు రాహుల్ శర్మ (5/23) స్పిన్ మ్యాజిక్ పని చేయడంతో వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన ఏకైక టి20లో భారత్ ‘ఎ’ జట్టు 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఉతప్ప (21 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఉన్ముక్త్ చంద్ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అపరాజిత్ (3) విఫలమైనా... యువరాజ్, కేదార్ జాదవ్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 19వ ఓవర్లో రస్సెల్ తొలి నాలుగు బంతులకు జాదవ్, యువరాజ్, నమన్ ఓజా (0), యూసుఫ్ పఠాన్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కట్టడి చేశాడు. చివర్లో నర్వాల్ (7 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) చెలరేగడంతో భారత్‌కు భారీ స్కోరు ఖాయమైంది. రస్సెల్ 4, నర్స్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ‘ఎ’ 16.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై ఓడింది. ఫ్లెచర్ (22 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. థామస్ (25 బంతుల్లో 21; 1 ఫోర్), బూనర్ (11 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఓ దశలో 80 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను నర్స్ (16), థామస్‌లు ఏడో వికెట్‌కు 35 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. రాహుల్ శర్మ 5, వినయ్, యువరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఉతప్ప (ఎల్బీడబ్లూ బి) పెరుమాల్ 35; ఉన్ముక్త్ (సి) ఎడ్వర్డ్స్ (బి) నర్స్ 47; యువరాజ్ (సి) పావెల్ (బి) రస్సెల్ 52; అపరాజిత్ (సి) ఎడ్వర్డ్స్ (బి) నర్స్ 3; జాదవ్ (సి) బూనర్ (బి) రస్సెల్ 42; యూసుఫ్ (సి) ఫ్లెచర్ (బి) రస్సెల్ 0; నమన్ ఓజా (సి) పెరుమాల్ (బి) రస్సెల్ 0; నర్వాల్ నాటౌట్ 18; వినయ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 214. వికెట్లపతనం: 1-74; 2-94; 3-109; 4-189; 5-189; 6-189; 7-189 బౌలింగ్: బేటన్ 4-0-58-0; రస్సెల్ 4-0-45-4; మిల్లర్ 2-0-28-0; పెరుమాల్ 4-0-35-1; నర్స్ 4-0-18-2; బూనర్ 2-0-29-0 వెస్టిండీస్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఫ్లెచర్ (బి) రాహుల్ 32; పావెల్ (సి) జాదవ్ (బి) వినయ్ 8; బూనర్ (సి) ఉన్ముక్త్ (బి) ఉనాద్కట్ 18; ఎడ్వర్డ్స్ (సి) యూసుఫ్ (బి) రాహుల్ 0; కార్టర్ (సి) అపరాజిత్ (బి) యువరాజ్ 6; థామస్ (సి) ఓజా (బి) రాహుల్ 21; రస్సెల్ (సి) ఉన్ముక్త్ (బి) యువరాజ్ 12; నర్స్ (సి) ఉతప్ప (బి) రాహుల్ 16; పెరుమాల్ (సి) ఉన్ముక్త్ (బి) వినయ్ 1; మిల్లర్ నాటౌట్ 4; బేటన్ (సి) ఉనాద్కట్ (బి) రాహుల్ 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (16.2 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్లపతనం: 1-21; 2-49; 3-55; 4-62; 5-65; 6-80; 7-115; 8-117; 9-119; 10-121 బౌలింగ్: యూసుఫ్ పఠాన్ 1-0-19-0; వినయ్ కుమార్ 3-0-22-2; ఉనాద్కట్ 2-0-11-1; రాహుల్ శర్మ 3.2-0-23-5; యువరాజ్ 4-0-24-2; నర్వాల్ 3-0-21-0. లిస్ట్ ‘ఎ’లో తొలిసారి... టి20 క్రికెట్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లతో వెస్టిండీస్ ‘ఎ’ బౌలర్ రస్సెల్ సంచలనం సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అనేక మంది హ్యాట్రిక్‌లు సాధించినా... లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వరుసగా నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్ రస్సెల్. -
యువీ సేన బోల్తా
బెంగళూరు: మిడిలార్డర్ ఆటగాడు జొనాథన్ కార్టర్ అటు బ్యాటింగ్ (132 బంతుల్లో 133; 18 ఫోర్లు; 3 సిక్స్)... ఇటు బౌలింగ్ (2/33)లోనూ అద్వితీయంగా రాణించడంతో వెస్టిండీస్ ‘ఎ’ జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన యువరాజ్ బృందం... మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో మాత్రం అన్ని రంగాల్లో విఫలమైంది. ఫలితంగా 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల అనధికారిక సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు సాధించింది. కళ్లు చెదిరే షాట్లతో అలరించిన కార్టర్ చక్కటి సెంచరీ చేయగా ఎడ్వర్డ్స్ (58 బంతుల్లో 36; 4 ఫోర్లు; 1 సిక్స్), జాన్సన్ (46 బంతుల్లో 39; 3 ఫోర్లు; 1 సిక్స్) ఓ మాదిరిగా రాణించారు. వినయ్‌కు మూడు, యూసుఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.4 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటయ్యింది. యువరాజ్ (58 బంతుల్లో 40; 3 ఫోర్లు; 1 సిక్స్), ఉన్ముక్త్ (72 బంతుల్లో 38; 3 ఫోర్లు; 1 సిక్స్), కేదార్ జాదవ్ (38 బంతుల్లో 35; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కమిన్స్‌కు నాలుగు, మిల్లర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆరంభంలో తడబడినా.. ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత బౌలర్లు విండీస్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. మూడు ఓవర్ల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టారు. అప్పటికి స్కోరు 21 పరుగులే. అయితే వన్‌డౌన్ ఆటగాడు ఎడ్వర్డ్స్, సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన కార్టర్ ఎలాంటి తడబాటు లేకుండా ఆడారు. వినయ్ వేసిన 11వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన ఎడ్వర్డ్స్ దూకుడుగా ఆడాడు. అయితే యూసుఫ్ వేసిన వైడ్ బంతిని ఆడబోయి స్టంప్ అయ్యాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 79 పరుగులు జత చేరాయి. వెంటనే బరిలోకి దిగిన రస్సెల్ వరుసగా రెండు సిక్స్‌లు బాది అదే ఓవర్లో చిక్కాడు. అనంతరం జాన్సన్‌తో జత కట్టిన కార్టర్ మెరుపులు మెరిపించాడు. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతను 82 బంతుల్లో అర్ధ సెంచరీ చేసినా సెంచరీ అందుకునేందుకు మరో 35 బంతులు మాత్రమే తీసుకున్నాడు. 49వ ఓవర్లో ఉనాద్కట్‌కు వికెట్ల ముందు దొరికే దాకా జోరు కొనసాగించాడు. బ్యాట్స్‌మెన్ విఫలం 18 పరుగులకే వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ఏ దశలోనూ విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయింది. యువరాజ్, ఉన్ముక్త్ పోరాడిన తీరు ఆశలు రేపినా మిగతా బ్యాట్స్‌మెన్ లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోయారు. మరో భారీ స్కోరు వైపు కెప్టెన్ యువీ దూసుకెళుతున్న తరుణంలో మిల్లర్ దెబ్బతీశాడు. 28వ ఓవర్లో మిల్లర్ యువరాజ్, యూసుఫ్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపడంతో భారత్ ఆశలు వదులుకుంది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఫ్లెచర్ (సి) నమన్ (బి) వినయ్ 15; పావెల్ (సి) నమన్ (బి) వినయ్ 4; ఎడ్వర్డ్స్ (స్టంప్డ్) నమన్ (బి) యూసుఫ్ 36; కార్టర్ ఎల్బీడబ్ల్యు (బి) ఉనాద్కట్ 133; రస్సెల్ (సి) నర్వాల్ (బి) యూసుఫ్ 12; జాన్సన్ (సి) చంద్ (బి) వినయ్ 39; థామస్ నాటౌట్ 13; నర్స్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో ఆరు వికెట్లకు) 279 వికెట్ల పతనం: 1-20; 2-21; 3-100; 4-112; 5-243; 6-620. బౌలింగ్: ఉనాద్కట్ 10-1-57-1; నర్వాల్ 10-2-52-0; వినయ్ 10-1-56-3; నదీమ్ 10-0-38-0; యూసుఫ్ 9-0-61-2; మన్దీప్ 1-0-7-0. భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఉతప్ప (బి) కార్టర్ 10; ఉన్ముక్త్ (సి) ఫ్లెచర్ (బి) నర్స్ 38; మన్దీప్ సింగ్ (సి) థామస్ (బి) కమిన్స్ 3; యువరాజ్ (సి) పావెల్ (బి) మిల్లర్ 40; జాదవ్ (సి) థామస్ (బి) కమిన్స్ 35; యూసుఫ్ (సి) నర్స్ (బి) మిల్లర్ 0; నమన్ (బి) కమిన్స్ 34; నర్వాల్ (సి) థామస్ (బి) రస్సెల్ 18; వినయ్ (బి) కమిన్స్ 1; నదీమ్ నాటౌట్ 21; ఉనాద్కట్ (సి) పెరుమాల్ (బి) కార్టర్ 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 224 వికెట్ల పతనం: 1-15; 2-16; 3-82; 4-114; 5- 114; 6-148; 7-177; 8-187; 9-187; 10-224. బౌలింగ్: కమిన్స్ 10-0-31-4; రస్సెల్ 10-0-56-1; కార్టర్ 6.4-0-33-2; నర్స్ 8-0-32-1; పెరుమాల్ 5-0-25-0; మిల్లర్ 9-1-46-2.