దుమ్మురేపిన యువీ | All-round Yuvraj Singh leads from the front as India 'A' crush hapless West Indies 'A' | Sakshi
Sakshi News home page

దుమ్మురేపిన యువీ

Published Sun, Sep 22 2013 12:57 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

దుమ్మురేపిన యువీ - Sakshi

దుమ్మురేపిన యువీ

బెంగళూరు: డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (35 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారానికి తోడు రాహుల్ శర్మ (5/23) స్పిన్ మ్యాజిక్ పని చేయడంతో వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన ఏకైక టి20లో భారత్ ‘ఎ’ జట్టు 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది.
 
 ఓపెనర్లు ఉతప్ప (21 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఉన్ముక్త్ చంద్ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అపరాజిత్ (3) విఫలమైనా... యువరాజ్, కేదార్ జాదవ్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 19వ ఓవర్‌లో రస్సెల్ తొలి నాలుగు బంతులకు జాదవ్, యువరాజ్, నమన్ ఓజా (0), యూసుఫ్ పఠాన్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కట్టడి చేశాడు. చివర్లో నర్వాల్ (7 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) చెలరేగడంతో భారత్‌కు భారీ స్కోరు ఖాయమైంది. రస్సెల్ 4, నర్స్ 2 వికెట్లు తీశారు.
 
  తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ‘ఎ’ 16.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై ఓడింది. ఫ్లెచర్ (22 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. థామస్ (25 బంతుల్లో 21; 1 ఫోర్), బూనర్ (11 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఓ దశలో 80 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను నర్స్ (16), థామస్‌లు ఏడో వికెట్‌కు 35 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. రాహుల్ శర్మ 5, వినయ్, యువరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.
 
 స్కోరు వివరాలు
 భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఉతప్ప (ఎల్బీడబ్లూ బి) పెరుమాల్ 35; ఉన్ముక్త్ (సి) ఎడ్వర్డ్స్ (బి) నర్స్ 47; యువరాజ్ (సి) పావెల్ (బి) రస్సెల్ 52; అపరాజిత్ (సి) ఎడ్వర్డ్స్ (బి) నర్స్ 3; జాదవ్ (సి) బూనర్ (బి) రస్సెల్ 42; యూసుఫ్ (సి) ఫ్లెచర్ (బి) రస్సెల్ 0; నమన్ ఓజా (సి) పెరుమాల్ (బి) రస్సెల్ 0; నర్వాల్ నాటౌట్ 18; వినయ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 214.
 వికెట్లపతనం: 1-74; 2-94; 3-109; 4-189; 5-189; 6-189; 7-189
 బౌలింగ్: బేటన్ 4-0-58-0; రస్సెల్ 4-0-45-4; మిల్లర్ 2-0-28-0; పెరుమాల్ 4-0-35-1; నర్స్ 4-0-18-2; బూనర్ 2-0-29-0
 వెస్టిండీస్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఫ్లెచర్ (బి) రాహుల్ 32; పావెల్ (సి) జాదవ్ (బి) వినయ్ 8; బూనర్ (సి) ఉన్ముక్త్ (బి) ఉనాద్కట్ 18; ఎడ్వర్డ్స్ (సి) యూసుఫ్ (బి) రాహుల్ 0; కార్టర్ (సి) అపరాజిత్ (బి) యువరాజ్ 6; థామస్ (సి) ఓజా (బి) రాహుల్ 21; రస్సెల్ (సి) ఉన్ముక్త్ (బి) యువరాజ్ 12; నర్స్ (సి) ఉతప్ప (బి) రాహుల్ 16; పెరుమాల్ (సి) ఉన్ముక్త్ (బి) వినయ్ 1; మిల్లర్ నాటౌట్ 4; బేటన్ (సి) ఉనాద్కట్ (బి) రాహుల్ 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (16.2 ఓవర్లలో ఆలౌట్) 121.
 
 వికెట్లపతనం: 1-21; 2-49; 3-55; 4-62; 5-65; 6-80; 7-115; 8-117; 9-119; 10-121
 బౌలింగ్: యూసుఫ్ పఠాన్ 1-0-19-0; వినయ్ కుమార్ 3-0-22-2; ఉనాద్కట్ 2-0-11-1; రాహుల్ శర్మ 3.2-0-23-5; యువరాజ్ 4-0-24-2; నర్వాల్ 3-0-21-0.
 
 
 లిస్ట్ ‘ఎ’లో తొలిసారి...
 టి20 క్రికెట్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లతో వెస్టిండీస్ ‘ఎ’ బౌలర్ రస్సెల్ సంచలనం సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అనేక మంది హ్యాట్రిక్‌లు సాధించినా... లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో వరుసగా నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్ రస్సెల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement