‘బెంగ’ తీర్చిన యువీ.. | Royal Challengers Bangalore team won against Delhi Daredevils | Sakshi
Sakshi News home page

‘బెంగ’ తీర్చిన యువీ..

Published Wed, May 14 2014 1:15 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

‘బెంగ’ తీర్చిన యువీ.. - Sakshi

‘బెంగ’ తీర్చిన యువీ..

మూడు మ్యాచ్‌ల తర్వాత గెలిచిన రాయల్ చాలెంజర్స్
 బెంగళూరు: వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ చాలెంజర్స్ ఐపీఎల్‌లో కీలకదశలో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. యువరాజ్ (29 బంతుల్లో 68 నాటౌట్; 1 ఫోర్, 9 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు... బౌలర్లు మురళీధరన్ (2/25), స్టార్క్(2/26)ల నిలకడ తోడవడంతో... బెంగళూరు 16 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై విజయం సాధించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది.
 
 యువీతో పాటు డివిలియర్స్ (17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పార్థివ్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు) రాణించారు. ఆ తర్వాత డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. డుమిని (30 బంతుల్లో 48; 3 ఫోర్లు,3 సిక్స్‌లు), పీటర్సన్ (29 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్), జాదవ్ (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. దీంతో డేర్ డెవిల్స్‌కు వరుసగా ఐదో పరాజయం తప్పలేదు.
 
 యు‘వీరంగం’
 యువరాజ్ క్రీజులోకి వచ్చే సమయానికి బెంగళూరు స్కోరు 12.3 ఓవర్లలో 94/3. క్రీజులో సెటిలయ్యేందుకు కొద్దిగా సమయం తీసుకున్న యువీ... ఆ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. తాహిర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది అభిమానుల్లో జోష్ పెంచాడు. చివరి ఓవర్‌లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఓ భారీ సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసిన యువీ.. వరుసగా మూడు మూడు సిక్సర్లు కొట్టి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అభేద్యమైన 4 వికెట్‌కు రాణాతో కలిసి యువీ 79 పరుగులు జోడించాడు. మొత్తానికి చాలెంజర్స్ చివరి 5 ఓవర్లలో 71 పరుగులు చేసింది.
 
 రాణించిన డుమిని
 లక్ష్యఛేదనలో డేర్ డెవిల్స్ 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా... మయాంక్ అగర్వాల్, కెప్టెన్ పీటర్సన్,డుమిని, జాదవ్ పోరాడారు. అయితే బెంగళూరు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో మ్యాచ్‌పై పట్టు జారకుండా చూసుకున్నారు.
 
 స్కోరు వివరాలు
 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) రాహుల్ శుక్లా 22; పార్థివ్ పటేల్ (సి) కార్తీక్ (బి) షమీ 29; కోహ్లి రనౌట్ 10; డివిలియర్స్ (బి) కౌల్ 33; యువరాజ్ నాటౌట్ 68; సచిన్ రాణా నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) : 186.
 వికెట్ల పతనం: 1-33; 2-45; 3-94; 4-107.
 
 బౌలింగ్: డుమిని 4-0-25-0; షమీ 4-0-31-1; కౌల్ 4-0-37-1; రాహుల్ శక్లా 4-0-41-1; తాహిర్ 4-0-48-0.
 
 ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (బి) స్టార్క్ 6; విజయ్ ఎల్బీడబ్ల్యూ (బి) మురళీధరన్ 1; అగర్వాల్ (సి) రాణా (బి) అహ్మద్ 31; పీటర్సన్ (స్టంప్డ్) పటేల్ (బి) చాహల్ 33; డుమిని (బి) స్టార్క్ 48; కార్తీక్ (సి) చాహల్ (బి) మురళీధరన్ 1; జాదవ్ రనౌట్ 37; శుక్లా నాటౌట్ 2 ; షమీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) : 170
 వికెట్ల పతనం:1-2 ; 2-10; 3-73; 4-97; 5-102; 6-147; 7-168.
 బౌలింగ్: మురళీధరన్ 4-0-25-2; స్టార్క్ 4-0-26-2; అహ్మద్ 4-0-40-1; చాహల్ 4-0-45-1; యువరాజ్ 4-0-28-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement