అతను చెలరేగితే ఐపీఎల్-10 మళ్లీ మనదే ‌! | David Warner comment on yuvraj | Sakshi
Sakshi News home page

అతను చెలరేగితే ఐపీఎల్-10 మళ్లీ మనదే ‌!

Published Thu, Apr 6 2017 3:10 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

అతను చెలరేగితే ఐపీఎల్-10 మళ్లీ మనదే ‌!

అతను చెలరేగితే ఐపీఎల్-10 మళ్లీ మనదే ‌!

హైదరాబాద్‌: యువరాజ్‌ సింగ్‌ ఇదే ఫామ్‌ కొనసాగిస్తూ చెలరేగి ఆడితే వరుసగా రెండోసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సొంతం చేసుకునే అవకాశముందని ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో చెలరేగి ఆడి 62 పరుగులు చేసిన యూవీపై వార్నర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. బెంగళూరు జట్టుపై 35 పరుగుల తేడాతో విజయం సాధించడంలో యూవీ కీలక పాత్ర పోషించాడని అన్నాడు.

'యూవీ అంటే అదీ. అతని ఆడుతున్నప్పుడు మామూలుగా టీవీల్లో చూసేవాడిని. అతను అద్భుతమై స్ట్రోక్‌తో, క్లీన్‌ హిట్టింగ్‌తో చెలరేగి ఆడాడు. అతను మళ్లీ ఫామ్‌ను అందుకున్నాడు. ఇదే తరహాలో అతను దూకుడుగా ఆడాలని మేం కోరుకుంటున్నాం' అని వార్నర్‌ ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ అనంతరం మీడియాతో చెప్పారు. ప్రస్తుత టోర్నమెంట్‌లో అతను ఐదారు మ్యాచ్‌లలో ఈవిధంగా చెలరేగి ఆడితే చాలు.. మేం అలవోకగా ఫైనల్‌కు చేరుతాం. ఫైనల్‌లోనూ గెలుపొందుతాం' అని చెప్పాడు. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు సమిష్టి కృషితో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చిందని ఆయన కొనియాడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement