'అక్కడ కూడా ఇదే జోరు కొనసాగిస్తా' | David Warner keen to continue IPL 2017 form into Champions trophy | Sakshi
Sakshi News home page

'అక్కడ కూడా ఇదే జోరు కొనసాగిస్తా'

Published Fri, May 5 2017 8:52 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

'అక్కడ కూడా ఇదే జోరు కొనసాగిస్తా'

'అక్కడ కూడా ఇదే జోరు కొనసాగిస్తా'

హైదరాబాద్‌: ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌..వచ్చే నెల్లో ఆరంభమయ్యే చాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఇదే జోరును కొనసాగిస్తానని అన్నాడు. శుక్రవారం నగరంలోని క్రీడా ఉత్పత్తుల సంస్థ ఆసిక్స్‌ స్టోర్‌ను సన్‌జట్టు సహచరుడు కేన్‌ విలియమ్సన్‌తో కలిసి సందర్శించిన వార్నర్‌ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. గత నాలుగు నెలలుగా మంచి ఫామ్‌లో ఉన్నానన్న వార్నర్‌ చాంపియన్స్‌ ట్రోఫీలోనూ రాణిస్తాననే నమ్మకముందన్నాడు.

‘ప్రపంచంలోని 8 అత్యుత్తమ జట్లు పాల్గొనే చాంపియన్స్‌ ట్రోఫీలో ప్రతీ ఆటగాడు తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలనుకుంటాడు. నేను కూడా ఇదే జోరును అక్కడా కొనసాగిస్తా.  చాంపియన్స్‌గా నిలవాలంటే ప్రతీ మ్యాచ్‌ను గెలవాల్సిందే. స్మిత్‌ సారథ్యంలోని మా జట్టు పటిష్టంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో మేం టోర్నీని ప్రారంభిస్తాం’ అని అన్నాడు. మరోవైపు ఐపీఎల్‌లో లీగ్‌ మ్యాచ్‌లు ముగిసే సరికి జట్టును తొలిరెండు స్థానాల్లో నిలుపడమే తన లక్ష్యయమని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement