చెట్టును ఢీకొట్టిన కారు.. డ్రైవర్ మృతి
కొనకనమిట్ల(ప్రకాశం): వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
వైఎస్సార్ జిల్లా నుంచి ఒంగోలుకు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారుడ్రైవర్ అఫ్జల్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులు ఒంగోలులో జరుగుతున్న ఓ వివాహానికి వెళ్తున్న కడప వాసులుగా గుర్తించారు.