chinna sankarampeta
-
చెరువులో పడి చిరుత మృతి
చిన్నశంకరంపేట (మెదక్): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఓ చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖాజాపూర్ అటవీ ప్రాంతంలోని పటేల్ చెరువులో రెండు మూడు రోజుల కిందటే ఏడేళ్ల వయసు గల చిరుత చెరువులో పడి మృతి చెందగా, మంగళవారం కళేబరం చెరువులో తేలింది. ఉదయం అక్కడికి వెళ్లిన స్థానిక రైతులు చిరుత కళేబరాన్ని గమ నించి సర్పంచ్‌కు సమాచారం అందించారు. సర్పంచ్.. అటవీ శాఖ, రెవెన్యూ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణాగౌడ్, రామాయంపేట ఫారెస్ట్ రేంజర్ నజియాతబుసం, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత కళేబరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ముళ్ల పంది దాడి చేసినట్టు భావిస్తున్నారు. పొట్టభాగంలో గాయమైనట్లు గుర్తించారు. చిరుత అవయవ భాగాలను సేకరించి సంగారెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ అనుమా నాస్పద స్థితిలో చెరువులో పడి చిరుత మృతి చెందిందని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. -
నోట్లో గుడ్డలు కుక్కి.. చిన్నారి దారుణహత్య
- చిన్నారి దారుణహత్య - తప్పిపోయిన 24 గంటల లోపే దారుణం - ఆందోళనలో కుటుంబ సభ్యులు చిన్నశంకరంపేట : ఆడుకునేందుకు వెళ్లిన ముక్కుపచ్చలారని చిన్నారి నోట్లో బట్టలు కుక్కి అత్యంత పాశవికంగా హత్య చేసి పంట పొలంలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన మండలంలోని సంకాపూర్‌లో శనివారం రాత్రి వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సంకాపూర్ గ్రామానికి చెందిన గజగట్ల స్వామి, శ్యామల దంపతుల రెండో కుమార్తె స్రవంతి (5) శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లింది. అయితే అదే రోజు గ్రామంలో ఓ పెళ్లి విందు కూడా జరుగుతుండడంతో చిన్నారి అక్కడ ఆడుకునేందుకు వెళ్లిందని స్రవంతి తల్లిదండ్రులు భావించారు. అయితే రాత్రి అయినా చిన్నారి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు. పెళ్లి విందు జరిగిన ఇంటి వద్దా ఆరా తీశారు. వారి వెంట వచ్చిన వాహనాల్లో ఏమైనా వెళ్లిందేమోనని ఆ గ్రామానికి కూడా వెళ్లి వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం చిన్నారి తండ్రి గజగట్ల స్వామి ఫిర్యాదు చేసి అనంతరం గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉండగా.. గ్రామ శివారులో గల తాగునీటి ట్యాంక్ పక్కన నుంచి దుర్వాసన వస్తుండడంతో పశువుల కాపరులు పలువురు అక్కడికి వెళ్లి చూశారు. అయితే స్వామి కుమార్తె స్రవంతి విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో స్రవంతి తండ్రి స్వామి అక్కడికి చేరుకుని స్రవంతి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. గ్రామస్తులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.