నోట్లో గుడ్డలు కుక్కి.. చిన్నారి దారుణహత్య | child's brutal murder in chinna shakarampeta | Sakshi
Sakshi News home page

నోట్లో గుడ్డలు కుక్కి.. చిన్నారి దారుణహత్య

Published Sat, Aug 16 2014 11:11 PM | Last Updated on Wed, Aug 29 2018 8:24 PM

నోట్లో గుడ్డలు కుక్కి.. చిన్నారి దారుణహత్య - Sakshi

నోట్లో గుడ్డలు కుక్కి.. చిన్నారి దారుణహత్య

- చిన్నారి దారుణహత్య
- తప్పిపోయిన 24 గంటల లోపే దారుణం
- ఆందోళనలో కుటుంబ సభ్యులు
 చిన్నశంకరంపేట : ఆడుకునేందుకు వెళ్లిన ముక్కుపచ్చలారని చిన్నారి నోట్లో బట్టలు కుక్కి అత్యంత పాశవికంగా హత్య చేసి పంట పొలంలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన మండలంలోని సంకాపూర్‌లో శనివారం రాత్రి వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సంకాపూర్ గ్రామానికి చెందిన గజగట్ల స్వామి, శ్యామల దంపతుల రెండో కుమార్తె స్రవంతి (5) శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లింది. అయితే అదే రోజు గ్రామంలో ఓ పెళ్లి విందు కూడా జరుగుతుండడంతో చిన్నారి అక్కడ ఆడుకునేందుకు వెళ్లిందని స్రవంతి తల్లిదండ్రులు భావించారు. అయితే రాత్రి అయినా చిన్నారి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు.

పెళ్లి విందు జరిగిన ఇంటి వద్దా ఆరా తీశారు. వారి వెంట వచ్చిన వాహనాల్లో ఏమైనా వెళ్లిందేమోనని ఆ గ్రామానికి కూడా వెళ్లి వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం చిన్నారి తండ్రి గజగట్ల స్వామి ఫిర్యాదు చేసి అనంతరం గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉండగా.. గ్రామ శివారులో గల తాగునీటి ట్యాంక్ పక్కన నుంచి దుర్వాసన వస్తుండడంతో పశువుల కాపరులు పలువురు అక్కడికి వెళ్లి చూశారు. అయితే స్వామి కుమార్తె స్రవంతి విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో స్రవంతి తండ్రి స్వామి అక్కడికి చేరుకుని స్రవంతి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. గ్రామస్తులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement