వీరంగం సృష్టించిన దొంగకు దేహశుద్ధీ
కృష్ణాజిల్లా నూజీవిడు తాలుకా ముసునూరు మండలం చిన్నబోయినపల్లిలో గత అర్థరాత్రి దొంగ ఓ ఇంట్లోకి చొరబడి కత్తితో వీరంగం సృష్టించాడు. ఇంట్లోని భార్యాభర్తలపై దాడి చేశారు. ఆ క్రమంలో భర్త గాయపడగా, భార్య మెడలోని బంగారు గొలుసు తెంచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆమె గట్టిగా అరిచింది. స్థానికులు వెంటనే అప్రమత్తమైయ్యారు.
దొంగను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్దీ చేసిశారు. అనంతరం దొంగను ముసునూరు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.