chirala mandal
-
బహిర్భూమికి వెళ్లిన యువతిపై దుండగుల అత్యాచారం
-
Vodarevu Fishing Harbour: హార్బర్ తీరానికే దర్బార్..
అలలపై ఆరాటం.. బతుకు నిత్యపోరాటం.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఒడ్డుకు తెచ్చిన మత్స్యసంపద అమ్మకానికీ జంఝాటం.. ఇదీ తరతరాలుగా బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గంగపుత్రుల దైన్యం. వీరి తలరాతలు మార్చేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. త్వరలో పనులు ప్రారంభం కానుండడంతో ఊరూవాడ సంబరపడుతున్నాయి. సాక్షి, బాపట్ల/చీరాల: మత్స్యకారులు ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో మైళ్ల దూరం వెళ్లి వేటాడిన మత్స్యసంపద దళారుల పరమవుతోంది. నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు, ఎండబెట్టుకునేందుకు అవసరమైన ఫ్లాట్‌ఫాంలు లేకపోవడంతో మద్రాసు ఏజెంట్లు చెప్పిన ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. దీనికితోడు ఏటా వచ్చే ప్రకృతి విపత్తులకు రూ.లక్షలు పెట్టి కొన్న పడవలు, వలలు సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. ఈ దయనీయ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని చీరాల మండలం వాడరేవు వాసులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఎట్టకేలకు వీరి కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే హార్బర్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. కొద్దిరోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి. పదేళ్ల క్రితమే సర్వే జరిగినా.. వాడరేవు హార్బర్ నిర్మాణానికి 2012లోనే సర్వే నిర్వహించారు. అప్పట్లోనే మినీ హార్బర్, ఫ్లోటింగ్ జెట్టి నిర్మించాలని నిర్ణయించినా.. ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాడరేవులో హార్బర్ నిర్మాణంపై దృష్టి సారించింది. దీనికోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ.532 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు ఆహ్వానించింది. ఆ పక్రియలో విశ్వసముద్ర ఇంజినీరింగ్ లిమిటెడ్ ఏజెన్సీ రూ.408.42 కోట్లతో టెండర్లను దక్కించుకుంది. ప్రస్తుతం 20 ఎకరాలు అవసరం ఉండగా 13 ఎకరాల వరకు రెవెన్యూ శాఖ అప్పగించింది. మిగిలినది భూసేకరణ ద్వారా తీసుకోనున్నారు. హార్బర్ నిర్మాణానికి 20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 80 శాతం నిధులు కేంద్ర మత్స్యమౌలిక అభివృద్ధి సంస్థ, నాబార్డు మంజూరు చేస్తాయి. నిజాంపట్నం హార్బర్ ఉన్నా.. ప్రస్తుతం వాడరేవులో హార్బర్ లేకపోవడంతో సముద్రంలో వేటాడిన మత్స్యసందపను ఒడ్డుకు తెచ్చుకునే అవకాశం లేదు. దీంతో కాకినాడ, చెన్నై ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. నిజాంపట్నంలో హార్బర్ ఉన్నా సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో చీరాల వాడరేవు నుంచి కాకినాడ గానీ చెన్నై గానీ వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఫలితంగా మత్స్యసంపద దళారుల పాలవుతోంది. దళారులు మత్స్యసంపదను తక్కువ ధరకు కొని చెన్నై, బెంగళూరు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. (క్లిక్: పల్నాడు రైతుల వినూత్న పంథా.. ‘ఫల’ప్రదం) ప్రయోజనాలివీ.. ► హార్బర్ నిర్మాణం పూర్తయితే 890 ఇంజిన్ బోట్లు, 350 మెకనైజ్డ్ బోట్లు, 75 చిన్న ఓడలు సురక్షితంగా నిలుపుకునే అవకాశం ఉంటుంది. ► స్థానికంగానే మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకోవచ్చు. ► ఒంగోలు, నెల్లూరు, నిజాంపట్నం నుంచి బోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ► స్థానిక మత్స్యకార మహిళలకు సమృద్ధిగా జీవనోపాధి లభిస్తుంది. ► జిల్లాలోని తీరప్రాంతం అభివృద్ధి చెందుతుంది. జిల్లాకే తలమానికం హార్బర్ నిర్మాణం పూర్తయితే వాడరేవు జిల్లాకే తలమానికంగా మారుతుంది. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నా హయాంలో హార్బర్ నిర్మాణ పనులు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నా. మరోనెలలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెడతాం. దీనికితోడు వాడరేవు నుంచి పిడుగురాళ్ళ వరకు నేషనల్ హైవే మంజూరైంది. త్వరలో ఆ పనులూ ప్రారంభం కానున్నాయి. – కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే, చీరాల మరో నెలలో పనులు హార్బర్ నిర్మాణం ఎంతో మేలు చేస్తోంది. మత్స్యసంపదకు గిట్టుబాటు ధర లభిస్తుంది. సరుకు ఎండబెట్టుకునేందుకు ఫ్లాట్‌ఫాంలు, నిల్వ ఉంచుకునేందుకు ఏసీ స్టోరేజ్‌లు, డీజీల్ బంకులు, రవాణాకు రోడ్లు అందుబాటులోకి వస్తాయి. మరో నెలలో హార్బర్ పనులు ప్రారంభమవుతాయి. – డాక్టర్ పి.సురేష్, మత్య్సశాఖ జాయింట్ డైరెక్టర్ -
నాన్నా.. నీ కష్టాన్ని చూడలేను ఇక వెళ్లొస్తా!
చీరాల అర్బన్: తాను తండ్రికి భారం కాకూడదని భావించిన ఓ యువతి బలవన్మరణం చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం కొత్తపేటలో జరిగింది. వేల్పూరి రాంబాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. రాంబాబు సౌదీలో ఉద్యోగం చేస్తూ తన ముగ్గురు పిల్లలను చదివించాడు. చివరి అమ్మాయి వైష్ణవి (22) చీరాలలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. 2 నెలల క్రితం స్వదేశానికి వచ్చిన రాంబాబుతో తాను సివిల్స్ కోచింగ్ తీసుకుంటానని వైష్ణవి చెప్పింది. ఆర్థిక ఇబ్బందులున్నా సరే కుమార్తె మాట కాదనలేక రాంబాబు హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో మాట్లాడి వచ్చాడు. డబ్బులు కట్టడానికి రాంబాబు పడుతున్న ఇబ్బందులను వైష్ణవి గమనించింది. తాను తండ్రికి భారంగా మారుతున్నానని కలత చెంది, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వైష్ణవి మృతి చెందింది. -
పాత సామాన్లకు ఉల్లిపాయలంటూ..!
సాక్షి, చీరాల రూరల్: పాత సామాన్లకు ఉల్లిపాయలు ఇస్తామని గ్రామాల్లో సంచరిస్తూ ఉదయం సమయాల్లో రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు చోరీకి పాల్పడే ఆరుగురు సభ్యుల ముఠాను చీరాల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5.40 లక్షల విలువైన సామాగ్రితో పాటు దొంగతనాలకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వై జయరామ సుబ్బారెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. నిందితులంతా చీరాల వాసులే... చీరాలలోని రామకృష్ణాపురం పంచాయతీ బండపాలెం కుందేరు ఒడ్డున నివాసముండే కత్తుల సుందరరావు, జంగాలపల్లి తిరుపతయ్య, పసుపులేటి కృష్ణ, పసుపులేటి బ్రహ్మయ్య, పసుపులేటి బాషా అలియాస్ అంజయ్యతో పాటు వీరికి సహాయ కారిగా ఉండే మరో మైనర్ బాలుడు కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. వీరు తిరిగేందుకు ఓ ఆటో ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా ఉదయం సమయంలో గ్రామాల్లో పాత సామాన్లకు ఉల్లిపాయలు ఇస్తామంటూ తిరుగుతుంటారు. మధ్యాహ్న సమయంలో భోజనాలు చేసేందుకని ఆయా గ్రామాలకు సమీపంలో ఉండే పొలాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో పొలాల్లో ఎక్కడెక్కడ విద్యుత్ మోటార్లు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లున్నాయనే విషయాలను రెక్కీ నిర్వహించేవారు. ఇక రాత్రిళ్లు వారు ఎంచుకున్న గ్రామ పొలాల్లోకి ఆటోతో సహా వెళ్లి విద్యుత్ మోటార్లు, విద్యుత్ ట్రాన్స్‌పార్మర్లలోని రాగి సామాగ్రిని దొంగిలించి ఆటోలో వేసుకుని పరారయ్యేవారు. అలా దొంగిలించిన వస్తువులను విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న దొంగతనాలకు ఉపయోగించిన ఆటో రివార్డులు అందజేసిన డీఎస్పీ... కేసులను ఎంతో చాకచక్యంగా చేధించిన టూటౌన్ సీఐ ఎండి. ఫిరోజ్, ఎస్సై విజయ్ కుమార్, కానిస్టేబుళ్లు మహేష్, ఆంజనేయులు, రామ కోటేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు. కేసులను చేధించిన వారందరికి డీఎస్పీ చేతులు మీదుగా రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వ్యక్తులు వస్తే వారు అనుమానస్పందంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏడాది కాలంగా ఎన్నో.. గత సంవత్సర కాలంగా చీరాల, ఈపురుపాలెం, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు, చిన్నగంజాం, జె.పంగులూరు గ్రామాల్లోని పొలాల్లో విద్యుత్ మోటార్లు అపహరణకు గురయ్యాయి. అలానే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని రాగి వైర్లను కూడా అపహరిస్తున్నారు. వీటిపై ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ ఆయా కేసులకు సంబంధించిన దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వీటికి సంబంధించి ఆయా పోలీస్స్టేషన్లలో 26 కేసులు నమోదయ్యాయి. అయితే దొంగతనాల విషయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ వై. జయరామ సుబ్బారెడ్డి దృష్టి సారించారు. టూటౌన్ సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై విజయ్‌కుమార్‌తో రెండు దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. సీఐ ఆధ్వర్యంలో ఏర్పడిన బృందాలు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఓ ఆటోలో ఓ మైనర్ బాలుడితో సహా ఐదుగురు వ్యక్తులు ఇనుప సామగ్రితో వస్తున్నారనే సమాచారంతో సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దీంతో ఆటోతో సహా నిందితులను బాపట్ల–ఒంగోలు జాతీయ రహదారిపై చీరాల వాడరేవు హాయ్ రెస్టారెంట్ సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న విద్యుత్ మోటార్లు, సుమారు రూ. 5.40 లక్షలు విలువైన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా చీరాలలోని రామకృష్ణాపురం పంచాయతీ బండపాలెం కుందేరు ఒడ్డున నివాసముండే వారిగా గుర్తించి అరెస్టు చేశారు. -
మోదీజీ.. స్వచ్ఛ భారత్ ఇదే!
స్వచ్ఛభారత్ కార్య్రక్రమం ఆరంభ శూరత్వంగా మిగిలింది. గ్రామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. జిల్లాలో స్వచ్ఛభారత్ అమలుపై ‘సాక్షి’ ఫోకస్ నిధుల కైంకర్యమే! ⇒చీరాల మండలంలో 15 గ్రామ పంచాయతీలుండగా ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఎక్కడి మురుగు అక్కడ నిలిచిపోవాల్సిందే! ⇒మండలానికి 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.50 లక్షలు ఉన్నాయి. అయినప్పటికీ మురుగు చింత తీరడంలేదు. ⇒ఒక్కో గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎన్ఆర్హెచ్ఎం నిధులు రూ.10000 మాత్రమే విడుదలవుతున్నాయి. ⇒వేటపాలెం మండలంలో అరుుతే రెండు గ్రామాల్లో మాత్రమే డ్రైనేజీ వ్యవస్థ ఉంది. మిగిలిన చోట్ల గతంలో నిర్మించిన కాలవలకు సైడు గోడలు పడి పోవడంతో వర్షం వచ్చినప్పుడు మురుగు రోడ్లపై పారుతోంది. ⇒అవసరం లేక పోయినా పర్సంటేజీల కోసం డ్రైనేజీలు ఏర్పాటు చేసి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన సంఘటనలున్నాయి. ⇒కేంద్ర ప్రభుత్వం నుంచి శానిటేషన్ కోసం ఆర్థిక సంఘం నిధులు లక్షల్లో విడుదల అవుతున్నాయి. అయితే వాటిని భుజించడానికే ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపుతున్నారు. -చీరాల టౌన్ మురుగు కాలువలు ఏవీ? ⇒దర్శి నియోజకవర్గ కేంద్రంతో పాటు దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో మురుగు కాలువలు చాలా తక్కువగా ఉండటంతో గ్రామాలు అపరిశుభ్రంగా మారారుు. ⇒సాక్షాత్తు రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి పట్టణంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. ⇒పభుత్వ కార్యాలయూలు, వైద్యశాల ముందు పశువుల దిబ్బలు, ఎర్ర చెరువు వద్ద చెత్తా చెదారం వల్ల దుర్వాసన వస్తోంది. ⇒కురిచేడు మండల గ్రామాల్లో చిన్న పాటి వర్షానికి కూడా రహదారులు బురదమయం కావాల్సిందే! ⇒దొనకొండలో రోడ్లపై నీరు నిలిచిపోతోంది. ⇒ముండ్లమూరులో రోడ్ల వెంబడి పేడ దిబ్బలు దర్శనమిస్తుంటారుు. ⇒పలు గ్రామాల్లో రోడ్లపై గేదెలను కట్టివేస్తుండటంతో పారిశుధ్యం దెబ్బతింటోంది. ⇒తూర్పుగంగవరంలో ప్రధాన వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోరుుంది. - తాళ్లూరు వ్యాధుల భయం ⇒కొత్తపట్నం మండలంలో పంచాయతీ నిధులు లేకపోవడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోరుు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ⇒పభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఎంపీ, ఎమ్మెల్యే కోటాలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ⇒స్వచ్ఛభారత్ పేరుతో ర్యాలీలు చేయడమే కానీ ఒరిగిందేమీ లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 59,622 మంది జనాభా ఉండగా. 13వ ఫైనాన్స్ కింద కోటి యాభై ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ⇒ పెద్ద మండలానికి తక్కువ నిధులు విడుదల కావడంతో వాటిని ఎలా సర్దాలో అధికారులకు అర్థం కావడంలేదు. ⇒కేవలం వీధులు చిమ్మడంతోనే పరిశుభ్రత ఎలా వస్తుందని జనం ప్రశ్నిస్తున్నారు. ⇒సంకువానిగుంట, ఆలూరు, గాదెపాలెం, అల్లూరులో నీటి సమస్యతో పాటు పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ⇒ మురుగు, దోమల దెబ్బకు ప్రాణాంతక వ్యాధులు విజృంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నారుు. - కొత్తపట్నం చిత్తడి.. చిత్తడి ⇒ మార్కాపురం నియోజకవర్గంలో 83 పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవటంతో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు మొక్కుబడిగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ⇒ వర్షాకాలం కావడంతో వీధులన్నీ చిత్తడిగా మారుతున్నారుు. కొన్ని చోట్ల పైపైన బ్లీచింగ్ పౌడర్ చల్లించి చేతులు దులుపుకుంటున్నారు. ⇒ చాలా గ్రామాల్లో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ లేక దుర్గంధం వ్యాపిస్తోంది. ⇒ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని కూడా సరిగా నిర్వహించలేదు. ఇప్పటికే రోగాలు విజృంభిస్తున్నారుు. ⇒ గొట్లగట్టు బస్టాండులో దుకాణదారులు చెత్తా చెదారాన్ని రహదారిపైకి ఊడ్చి కుప్పలు చేస్తున్నారు. వృథా నీరంతా రోడ్లపైకి వస్తుండటంతో తారు రోడ్డు గుంతల మయంగా మారుతోంది. ⇒ పాతపాడు, వెంగళపల్లి గ్రామాల్లో అరుుతే ముక్కుమూసుకొని నడవాల్సిందే!