వైష్ణవి (ఫైల్)
చీరాల అర్బన్: తాను తండ్రికి భారం కాకూడదని భావించిన ఓ యువతి బలవన్మరణం చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం కొత్తపేటలో జరిగింది. వేల్పూరి రాంబాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. రాంబాబు సౌదీలో ఉద్యోగం చేస్తూ తన ముగ్గురు పిల్లలను చదివించాడు. చివరి అమ్మాయి వైష్ణవి (22) చీరాలలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. 2 నెలల క్రితం స్వదేశానికి వచ్చిన రాంబాబుతో తాను సివిల్స్ కోచింగ్ తీసుకుంటానని వైష్ణవి చెప్పింది.
ఆర్థిక ఇబ్బందులున్నా సరే కుమార్తె మాట కాదనలేక రాంబాబు హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో మాట్లాడి వచ్చాడు. డబ్బులు కట్టడానికి రాంబాబు పడుతున్న ఇబ్బందులను వైష్ణవి గమనించింది. తాను తండ్రికి భారంగా మారుతున్నానని కలత చెంది, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వైష్ణవి మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment