మోదీజీ.. స్వచ్ఛ భారత్ ఇదే!
స్వచ్ఛభారత్ కార్య్రక్రమం ఆరంభ శూరత్వంగా మిగిలింది. గ్రామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. జిల్లాలో స్వచ్ఛభారత్ అమలుపై ‘సాక్షి’ ఫోకస్
నిధుల కైంకర్యమే!
⇒చీరాల మండలంలో 15 గ్రామ పంచాయతీలుండగా ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఎక్కడి మురుగు అక్కడ నిలిచిపోవాల్సిందే!
⇒మండలానికి 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.50 లక్షలు ఉన్నాయి. అయినప్పటికీ మురుగు చింత తీరడంలేదు.
⇒ఒక్కో గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులు రూ.10000 మాత్రమే విడుదలవుతున్నాయి.
⇒వేటపాలెం మండలంలో అరుుతే రెండు గ్రామాల్లో మాత్రమే డ్రైనేజీ వ్యవస్థ ఉంది. మిగిలిన చోట్ల గతంలో నిర్మించిన కాలవలకు సైడు గోడలు పడి పోవడంతో వర్షం వచ్చినప్పుడు మురుగు రోడ్లపై పారుతోంది.
⇒అవసరం లేక పోయినా పర్సంటేజీల కోసం డ్రైనేజీలు ఏర్పాటు చేసి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన సంఘటనలున్నాయి.
⇒కేంద్ర ప్రభుత్వం నుంచి శానిటేషన్ కోసం ఆర్థిక సంఘం నిధులు లక్షల్లో విడుదల అవుతున్నాయి. అయితే వాటిని భుజించడానికే ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపుతున్నారు. -చీరాల టౌన్
మురుగు కాలువలు ఏవీ?
⇒దర్శి నియోజకవర్గ కేంద్రంతో పాటు దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో మురుగు కాలువలు చాలా తక్కువగా ఉండటంతో గ్రామాలు అపరిశుభ్రంగా మారారుు.
⇒సాక్షాత్తు రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి పట్టణంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు.
⇒పభుత్వ కార్యాలయూలు, వైద్యశాల ముందు పశువుల దిబ్బలు, ఎర్ర చెరువు వద్ద చెత్తా చెదారం వల్ల దుర్వాసన వస్తోంది.
⇒కురిచేడు మండల గ్రామాల్లో చిన్న పాటి వర్షానికి కూడా రహదారులు బురదమయం కావాల్సిందే!
⇒దొనకొండలో రోడ్లపై నీరు నిలిచిపోతోంది.
⇒ముండ్లమూరులో రోడ్ల వెంబడి పేడ దిబ్బలు దర్శనమిస్తుంటారుు.
⇒పలు గ్రామాల్లో రోడ్లపై గేదెలను కట్టివేస్తుండటంతో పారిశుధ్యం దెబ్బతింటోంది.
⇒తూర్పుగంగవరంలో ప్రధాన వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోరుుంది. - తాళ్లూరు
వ్యాధుల భయం
⇒కొత్తపట్నం మండలంలో పంచాయతీ నిధులు లేకపోవడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోరుు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
⇒పభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఎంపీ, ఎమ్మెల్యే కోటాలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
⇒స్వచ్ఛభారత్ పేరుతో ర్యాలీలు చేయడమే కానీ ఒరిగిందేమీ లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 59,622 మంది జనాభా ఉండగా. 13వ ఫైనాన్స్ కింద కోటి యాభై ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయి.
⇒ పెద్ద మండలానికి తక్కువ నిధులు విడుదల కావడంతో వాటిని ఎలా సర్దాలో అధికారులకు అర్థం కావడంలేదు.
⇒కేవలం వీధులు చిమ్మడంతోనే పరిశుభ్రత ఎలా వస్తుందని జనం ప్రశ్నిస్తున్నారు.
⇒సంకువానిగుంట, ఆలూరు, గాదెపాలెం, అల్లూరులో నీటి సమస్యతో పాటు పారిశుధ్యం అధ్వానంగా ఉంది.
⇒ మురుగు, దోమల దెబ్బకు ప్రాణాంతక వ్యాధులు విజృంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నారుు. - కొత్తపట్నం
చిత్తడి.. చిత్తడి
⇒ మార్కాపురం నియోజకవర్గంలో 83 పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవటంతో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు మొక్కుబడిగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
⇒ వర్షాకాలం కావడంతో వీధులన్నీ చిత్తడిగా మారుతున్నారుు. కొన్ని చోట్ల పైపైన బ్లీచింగ్ పౌడర్ చల్లించి చేతులు దులుపుకుంటున్నారు.
⇒ చాలా గ్రామాల్లో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ లేక దుర్గంధం వ్యాపిస్తోంది.
⇒ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని కూడా సరిగా నిర్వహించలేదు. ఇప్పటికే రోగాలు విజృంభిస్తున్నారుు.
⇒ గొట్లగట్టు బస్టాండులో దుకాణదారులు చెత్తా చెదారాన్ని రహదారిపైకి ఊడ్చి కుప్పలు చేస్తున్నారు. వృథా నీరంతా రోడ్లపైకి వస్తుండటంతో తారు రోడ్డు గుంతల మయంగా మారుతోంది.
⇒ పాతపాడు, వెంగళపల్లి గ్రామాల్లో అరుుతే ముక్కుమూసుకొని నడవాల్సిందే!