CHIRUMARTHY LINGAIAH MLA
-
సీఎల్పీ విలీనం ఖాయం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియనాయక్ చెప్పారు. విలీన ప్రక్రియపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీ ఆర్ రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా టీఆర్ఎస్లో చేరనున్న ట్లు చెప్పారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రాజెక్టుల పూర్తి కోసమే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాష్ట్రం లో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని, స్థానిక సం స్థల ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్కు ఏకపక్షం గా తీర్పునిస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల బీఫారాల పంపిణీని టీఆర్ఎస్ ప్రారంభించిన నేపథ్యంలోనే తాము కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురికీ సంబంధించిన నియోజక వర్గాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యకు అనుగుణంగా జాబితాను అందజేసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిని కలసి బీఫారాలను తీసుకెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్లో సీఎల్పీని విలీనం చేసే ప్రక్రియ కోసమే ఈ ముగ్గురు అసెంబ్లీకి వచ్చినట్లు తెలిసింది. విలీన ప్రక్రియకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయడంలో భాగంగానే వీరిని టీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానించినట్లు సమాచారం. -
చిరుమర్తి లింగయ్య-లీడర్‌తో
-
అక్రమ దందాను ఆపివేయాలి
నకిరేకల్ : అధికారిక పేరుతో అక్రమంగా ఇసుక దందా కొనసాగుతోందని, తక్షణమే ఆపివేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. నకిరేకల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాలిగౌరారంమండలంవంగమర్తి సమీపంలోని మూసీనది నుం డి అధికారికంగా ఇసుక క్వారీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. అధికార పార్టీ పెద్ద నేతల అండదండలతోనే ఈ అక్రమ రవాణా దందా జోరుగా సాగుతుందని ఆరోపించారు. 20 టన్నులు ఇసుక వెళ్లాల్సి ఉండగా 35 నుండి 45 టన్నుల మేర ఇసుకను లారీలలోకి ఎత్తి తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా లారీల రవాణాతో గ్రామీణ రహదారులన్ని పూర్తిగా పాడవుతున్నాయన్నారు. మూసీనదిలో అధికారికంగా తెరిచిన ఇసుక క్వారీని తక్షణమే ఎత్తివేసి అక్రమ రవాణాను కట్టడి చే యాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని హె చ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఎండి మహబుబ్ అలీ,యాస కార్ణకర్‌రెడ్డి ఎంపీటీసీ గుర్రంగణేష్,నాయకు లు పన్నాల రాఘవరెడ్డి, రాచకొండ సైదులు, సుంకరబోయిన నర్సింహ,గందమల్ల జానయ్య,ఆరుట్ల శ్రవణ్, వంటెపాక జాని, కర్ణాకర్, గుండ్లపల్లి యాదగిరి, పల్లె విజయ్, చౌగోని లక్ష్మణ్, దాసరి సైదులు, ఈదుల్ల వెంకరమణ, ఉదయ్ పాల్గొన్నారు.