చిర్యాలకు పొటెత్తిన భక్తులు
కీసర (రంగారెడ్డి) : శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి సందర్భంగా రంగారెడ్డి జిల్లా చిర్యాల లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు. ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీస్వామివారిని దర్శించుకున్నారు.
దేవాలయంలో సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి పల్లకీసేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి విశేష అలంకరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ చెర్మైన్ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.