చిత్రమ్ చెప్పిన కథ
సమాజాన్ని ఎప్పటినుంచో వెంటాడుతున్న ఓ సమస్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ చిత్రమ్’. శివ, మేఘశ్రీ జంటగా కొడాలి సుబ్బారావుతో కలిసి జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు నెలలో విడుదల కానుంది. నిర్మాత కొడాలి సుబ్బారావు మాట్లాడుతూ -‘‘సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం.
కానీ అనివార్య కారణాల వల్ల విడుదలను అక్టోబరుకు వాయిదా వేశాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ‘ప్రేమకథా చిత్రమ్’ దర్శకుడైన జె.ప్రభాకర్‌రెడ్డి రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు.