chittie
-
చిట్టీల పేరుతో సొమ్ములు, అధిక వడ్డీలకు అప్పులు.. తీరా అడిగేసరికి..
సాక్షి,ఏలూరు (పశ్చిమ గోదావరి): చిట్టీలు వేయగా సుమారు రూ.1.80 కోట్లకు శఠగోపం పెట్టి పరారైన నిర్వాహకులరాలు శ్రీరంగం సత్యదుర్గపై చర్యలు తీసుకుని, తమ సొమ్ము ఇప్పించాలని ఏలూరు ఎంఆర్సీ కాలనీ, తంగెళ్లమూడి ప్రాంతాలకు చెందిన బాధితులు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సత్యదుర్గ 50వ డివిజన్లో నివసిస్తూ ఆ ప్రాంత డ్వాక్రా సీఆర్పీగా పనిచేస్తుండేదని తెలిపారు. లబ్ధిదారులకు అందాల్సిన సుమారు రూ.15 లక్షలు దారి మళ్ళించి ఆవిడ తన సొంతానికి వాడుకుని మోసం చేసిందన్నారు. దీనిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుళ్లగా ఆమె మోసం చేసినట్టు ధ్రువీకరించారని తెలిపారు. దీంతో అధికారులు సీఆర్పీని నిలదీయటంతో తిరిగి చెల్లిస్తానని ఆమె ఒప్పుకుని ఈ నెల 25న కుటుంబంతో సహా పరారైనట్టు చెప్పారు. దీనికి తోడు స్థానిక పరిచయాలతో చిట్టీల పేరుతో సొమ్ములు కట్టించుకుని, అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా పరారైనట్లు బాధితులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం అంతా కలిపి సుమారు రూ.1.80 కోట్లు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. తనకున్న రెండు భవనాలు, 75 గజాల స్థలం అమ్మి సొమ్ము ఇచ్చేస్తానని 6 నెలలుగా నమ్మిస్తూ వచ్చి ఆమె పరారైందని లబోదిబోమంటున్నారు. చదవండి: సిటీకి కొత్త.. నమ్మి ఆటో ఎక్కితే ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి.. -
‘చిట్టి’ సినిమాల్లో రాణింపు
విజయనగరం టౌన్: ఆ యువకుడికి చిన్ననాటి నుంచి సినిమా రంగం అంటే మక్కువ. కెమెరామెన్, దర్శకునిగా ఎదగాలని కలలు కనేవాడు. ఎక్కడ షూటింగ్ జరుగుతుందన్నా పరుగులెత్తేవాడు. అదే ఇష్టంతో ఇప్పుడు షార్ట్‌ఫిల్మ్‌లు తీసే స్థాయికి ఎదిగాడు. చక్కటి సందేశాత్మక చిత్రాలు చిత్రీకరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ కోనసీమ కుర్రోడే చిట్టి. పశ్చిమగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి విజయనగరం వచ్చి స్ధిరపడ్డాడు. అన్ని ప్రాంతాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసతో తన ఊర్లో ఉన్న పచ్చళ్ల వ్యాపారాన్ని ఇక్కడ ప్రారంభించాడు. గ్రామగ్రామాలు తిరిగి వ్యాపారాన్ని చేస్తూ, మంచి లోకేషన్లను కనిపెట్టాడు. మరోవైపు విజయనగరం, విశాఖలలోని పలు శిక్షణ కేంద్రాల్లో ఫొటోగ్రఫీ, కంప్యూటర్స్‌లో వెడ్డింగ్ ప్రీమియర్స్, యానిమేషన్స్ కోర్సులను నేర్చుకున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కెమెరామెన్‌గా రాణిస్తున్నాడు. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలే స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు. త్రీజీ లవ్‌తో క్రేజీ త్రీజీ లవ్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాకేష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రంగీలా’తో పాటు ‘గౌరీ విత్ ఘోస్ట్ హర్రర్ సిని మాకు అసోసియేట్ కెమెరామెన్‌గా పనిచేశా డు. హంటడ్ బంగ్లా పార్ట్–1,2, ఘోష్ట్ ఫ్రెండ్, ప్రేమ, ఎంసీఏ విద్యార్థుల నిరుద్యోగంపైన, జప్పా ఎఫ్ఎం పేరుతో తీసిన షార్ట్ ఫిల్మ్‌లు చిట్టికి మంచి పేరుతెచ్చిపెట్టాయి. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం.. సినీ పరిశ్రమ విశాఖ కు చేరువయ్యే రోజు లు దగ్గర్లోనే ఉన్నా యి. అందుకే విశాఖలో ఫోటోస్టూడియో రన్ చేస్తూ విజయనగరం నుంచి విశాఖ, అక్కడ నుంచి హైదరా బాద్ వరకూ వెళ్తూ షార్ట్‌ఫిల్మ్‌లు చేస్తున్నా ను. ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. దర్శకునిగా ఎదగాలన్నది లక్ష్యం. – చిట్టి, కెమెరామెన్ -
చిట్టీల పేరుతో రూ.2 కోట్లు దండుకుని..
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ చిట్టీల వ్యాపారి పలువురిని నిండా ముంచాడు. రూ.2 కోట్ల మేర దండుకుని ఉడాయించాడు. దీంతో బాధితులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. పట్టణానికి చెందిన గుండా విజయ్ స్థానికంగా చిట్టీలతోపాటు బియ్యం వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో సుమారు 25 మందికి రూ.2 కోట్ల మేర ఇవ్వాల్సి ఉంది. తీరా మూడు రోజుల క్రితం విజయ్ పరారు కావడంతో బాధితులు శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో అఫ్జల్ ఖాన్, జి.శ్రీను, పద్మా సత్యనారాయణ ఉన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.