విజయనగరం టౌన్: ఆ యువకుడికి చిన్ననాటి నుంచి సినిమా రంగం అంటే మక్కువ. కెమెరామెన్, దర్శకునిగా ఎదగాలని కలలు కనేవాడు. ఎక్కడ షూటింగ్ జరుగుతుందన్నా పరుగులెత్తేవాడు. అదే ఇష్టంతో ఇప్పుడు షార్ట్‌ఫిల్మ్‌లు తీసే స్థాయికి ఎదిగాడు. చక్కటి సందేశాత్మక చిత్రాలు చిత్రీకరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ కోనసీమ కుర్రోడే చిట్టి. పశ్చిమగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి విజయనగరం వచ్చి స్ధిరపడ్డాడు. అన్ని ప్రాంతాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసతో తన ఊర్లో ఉన్న పచ్చళ్ల వ్యాపారాన్ని ఇక్కడ ప్రారంభించాడు. గ్రామగ్రామాలు తిరిగి వ్యాపారాన్ని చేస్తూ, మంచి లోకేషన్లను కనిపెట్టాడు. మరోవైపు విజయనగరం, విశాఖలలోని పలు శిక్షణ కేంద్రాల్లో ఫొటోగ్రఫీ, కంప్యూటర్స్‌లో వెడ్డింగ్ ప్రీమియర్స్, యానిమేషన్స్ కోర్సులను నేర్చుకున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కెమెరామెన్‌గా రాణిస్తున్నాడు. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలే స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు.
త్రీజీ లవ్‌తో క్రేజీ
త్రీజీ లవ్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాకేష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రంగీలా’తో పాటు ‘గౌరీ విత్ ఘోస్ట్ హర్రర్ సిని మాకు అసోసియేట్ కెమెరామెన్‌గా పనిచేశా డు. హంటడ్ బంగ్లా పార్ట్–1,2, ఘోష్ట్ ఫ్రెండ్, ప్రేమ, ఎంసీఏ విద్యార్థుల నిరుద్యోగంపైన, జప్పా ఎఫ్‌ఎం పేరుతో తీసిన షార్ట్ ఫిల్మ్‌లు చిట్టికి మంచి పేరుతెచ్చిపెట్టాయి.
ఫొటోగ్రఫీ అంటే ఇష్టం..
సినీ పరిశ్రమ విశాఖ కు చేరువయ్యే రోజు లు దగ్గర్లోనే ఉన్నా యి. అందుకే విశాఖలో ఫోటోస్టూడియో రన్ చేస్తూ విజయనగరం నుంచి విశాఖ, అక్కడ నుంచి హైదరా బాద్ వరకూ వెళ్తూ షార్ట్‌ఫిల్మ్‌లు చేస్తున్నా ను. ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. దర్శకునిగా ఎదగాలన్నది లక్ష్యం. – చిట్టి, కెమెరామెన్
Comments
Please login to add a commentAdd a comment