Chloe Ferry
-
ఆ టీవీ నటి సైకో: మాజీ ప్రియుడు
లాస్ ఏంజిల్స్: బ్రిటన్ టీవీ రియాలిటీ స్టార్ క్లోహి ఫెరీపై ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ మండిపడ్డాడు. క్లోహి పచ్చి సైకో అని, ఆమెతో తాను గడిపిన ఆరు నెలల్లో తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపాడు. ఎంటీవీ ’జార్డీ షోర్’ షోతో ఫేమస్ అయిన క్లోహి ఫెరీ తాజాగా తన మాజీ ప్రియుడు సామ్ స్కాట్‌ను ఫేస్ చేయబోతున్నది. ’ఎక్స్ ఆన్ ద బీచ్’ షోలో భాగంగా ఈ ఇద్దరు ముఖాముఖి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా స్కాట్ మాట్లాడుతూ ’నా మాజీ ప్రియురాలు పూర్తి సైకో. ఆమెతో ఆరు నెలల నా అనుబంధం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మార్టి మెక్‌కెన్నాతో ఆమె సన్నిహితంగా గడుపడంతో ఇక మా అనుబంధం కొనసాగించడం కష్టంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు. ’జార్డీ షోర్’ షోలో ఉండగా క్లోహి ఫెరీస్ మెక్‌కెన్నాతో సాన్నిహిత్యం నెరిపింది. మెక్‌కెన్నాతో గడుపడమే కాకుండా మాజీ ప్రియులతోనూ సన్నిహితంగా ఉండటంతోనే ఆమెతో బ్రేకప్ చేసుకున్నానని స్కాట్ చెప్పాడు. -
షేమ్, షేమ్.. నటి ఫొటోపై కామెంట్స్
లండన్: ఇంగ్లీష్ నటి క్లోయె ఫెర్రీ ఫొటోపై నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న నాన్నమ్మతో కలసి ఆమె ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆస్పత్రిలోని బెడ్‌పై పడుకున్న ముసలావిడ తీవ్ర అస్వస్థతతో ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉండగా, ఆమె పక్కన కూర్చుని నవ్వుతూ పోజులిస్తూ ఫెర్రీ ఫొటో దిగింది. ఆమె మరణించిన తర్వాత ఫెర్రీ ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో పోస్ట్ చేసింది. నాన్నమ్మను చాలా ప్రేమిస్తున్నానని, ఎప్పటికీ మరచిపోలేనని, ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ కామెంట్ రాసింది. చావు బతుకుల మధ్య పోరాడుతున్న నాన్నమ్మతో ఫొటో దిగి పోస్ట్ చేయడం సిగ్గుచేటు అంటూ చాలా మంది నెటిజెన్లు విమర్శలు చేశారు. దీంతో ఆమె సోషల్ మీడియా నుంచి ఈ ఫొటోను తొలగించింది. కాగా కొందరు నెటిజెన్లు అంతకుముందు దీన్ని స్ర్కీన్ షాట్ తీసి షేర్ చేసుకున్నారు.