సీహెచ్‌ఎన్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
పిఠాపురంలోని కమ్యునిటీ హెల్త్ న్యూట్రిషన్ సెంటర్(సీహెచ్ఎన్సీ)లో గురువారం జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వైద్య అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వారిపై మండిపడ్డారు. సీహెచ్‌ఎన్‌సీలో కనీసం ఇంజక్షన్లు, సిరంజీలు లేకపోవడాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయంలో వైద్యాధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.