'కెల్లాగ్స్ చాకోస్'లో పురుగులు..స్పందించిన కంపెనీ..!
ఇటీవల ఎక్కువగా కెల్లాగ్స్ బ్రాండ్‌కి చెందిని చాకోస్ (కార్న్ ఫ్లాక్స్)ని బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ రూపంలో వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో వీటి వినియోగం బాగా ఎక్కువయ్యింది. ఎందుకంటే? సరిగ్గా తినేందుకు రెడీగా ఏమి అందుబాటులో లేకపోతే ఇది బెస్ట్ ఆప్షన్‌గా పనిచేస్తాయి. పైగా కడుపు నిండిన ఫీల్ ఉండటంతో చిన్నా పెద్దా అంతా వీటినే ఇష్టంగా తింటున్నారు. పైగా ఇవి తృణధాన్యాలకు సంబంధించినవి కూడా కావడంతో మంచి పోషకాలు కూడా లభిస్తాయన్న ఉద్దేశ్యంతో వీటికే ప్రాధాన్యత ఇస్తుంన్నారు. అలాంటి కెల్లాగ్స్ బ్రాండ్ చాకో ఫ్లాక్స్కి సంబంధించిన షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఒక వ్యక్తి కెల్లాగ్స్ చాకోస్ని కొనుగోలు చేశానని, తిందామని ఓపెన్ చేయగా ప్రతీదాంట్లో పురుగులు కనిపించాయని చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ "ఎక్స్ట్రా ప్రొటీన్ ఆయా క్యా" అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. అలాగే వీడియోలో ఆ ప్రొడక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ కూడా మార్చి 2024 అని రాసి ఉన్న ప్రూఫ్‌ని కూడా చూపించాడు.
ఐతే సదరు వీడియో నెట్టింట తెగ హల్చల్ చేయడంతో కెల్లాగ్స్ కంపెనీ స్పందించి.." మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వినియోగదారుల వ్యవహారాల బృందం మిమ్మల్ని సంప్రదిస్తుందని, సంప్రదించిన వివరాలను పంపించాల్సిందిగా పేర్కొంది". కెల్లాగ్స్ కంపెనీ. కాగా, నెటిజన్లు దయచేసి ఇంట్లో చేసినవే తినండి, తాము కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదుర్కొన్నామంటూ పోస్టులు పెట్టారు. ఇదిలా ఉంటే ఇలాంటి పరిస్థితే హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి కొనుగోలు చేసిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ బార్ విషయంలో ఎదురవ్వడం గమనార్హం.
View this post on Instagram
A post shared by CUMmentWala (@cummentwala_69)
(చదవండి: లండన్ వీధుల్లో లెహెంగాతో హల్చల్ చేసిన మహిళ!)