చట్టం పాటిస్తే చాక్లెట్ ఇస్తా
చట్టం పాటిస్తే చాక్లెట్ ఇస్తా
Published Thu, Jun 5 2014 6:24 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM
'చెప్పిన మాట వింటే చాక్లెట్ ఇస్తా...' చిన్న పిల్లలకు పెద్దలు ఇచ్చే లంచం ఇది. ఇప్పుడిదే ఫార్ములాను పట్టుకున్నారు భోపాల్ పోలీసులు. చట్టాన్ని పాటిస్తే చాక్లెట్ బహుమానంగా ఇస్తున్నారు.
గురువారం రోడ్డెక్కిన ద్విచక్రవాహనదారులకు పోలీసులు సర్ ప్రైజ్ ఇచ్చారు. హెల్మెట్ పెట్టుకున్న వారందరినీ ఆపి మరీ చాక్లెట్లు బహుమతిగా ఇచ్చారు. పోలీసులు చాక్లెట్లు ఇచ్చే సరికి వాహనదారులు 'దిమాగ్ కీ బత్తీ' ఆఫ్ అయిపోయింది. ఆ తరువాత హెల్మెట్ ఉన్న వారు దాన్ని చూపించి మరీ పోలీసు మామయ్యల దగ్గర నుంచి చాక్లెట్లు తీసుకున్నారు.
మరి హెల్మెట్లు లేని వారి సంగతేమిటి? వారందరినీ పోలీసులు మర్యాదగా తీసుకెళ్లి ఓ హాలులో భయంకరమైన రోడ్డు ప్రమాదాల్లో ఘోరంగా చనిపోయిన వారి దృశ్యాలు, భీకర యాక్సిడెంట్లు ఉన్న విడియోలు చూపించారు. బయటకి వచ్చే సరికి హెల్మెట్ రహిత డ్రైవర్లకు పిచ్చెక్కిపోయింది.
Advertisement