పవన్ కళ్యాణ్ ను అనుకరించిన అన్నయ్య!
సంచలన విజయంతోపాటు రికార్డుల కలెక్షన్లతో దూసుకుపోతున్న అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ విభిన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నసంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను ఆయన సోదరుడు నాగబాబు అనుకరించనున్నాడు. త్వరలో విడుదల కానున్న 'చూసినోడికి చూసినంత' అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను పోలివుండే కారెక్టర్ ను నాగబాబు పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు అనిల్ వాటుపాలి తెలిపారు.
ఈ చిత్రంలో పవన్ పేరుతో ఉండే పాత్రను ఈ చిత్రంలో నాగబాబు చేస్తున్నారని.. ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ పాత్రతో పోలివుండే లుక్ ను షూట్ చేశామన్నారు. కేవలం వినోదం కోసమే నాగబాబుతో ఈ పాత్రను చేయిస్తున్నామని.. అభిమానులు మరోలా భావించకూడదు అని అనిల్ అన్నారు. ఈ పాత్రలో నటించేటప్పుడు నాగబాబు ఎంజాయ్ చేశారు అని తెలిపారు. ఈ చిత్రంలో శివాజీ, కృష్ణుడు, నిత్యాలు ప్రధాన పాత్రలో నటించారు.