choper
-
ఆ పెట్టెలో ఏముంది?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన సందర్భంగా ఆయన హెలికాప్టర్లో నలుపురంగు పెట్టెను ప్రైవేటు కారులో తరలించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆ పెట్టెలో ఏముందో ప్రధాని మోదీ వెంటనే చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ‘ఈ నెల 9న చిత్రదుర్గ సభకు మోదీ హెలికాప్టర్‌కు రక్షణగా మరో మూడు హెలికాప్టర్లు వచ్చాయి. ఇవి ల్యాండ్ కాగానే ఓ హెలికాప్టర్ నుంచి నలుపురంగులో ఉన్న పెట్టెను ఇన్నోవా కారులో ఎక్కించారు. ఈ కారు ఎస్పీజీ వాహనశ్రేణిలో భాగం కాదు’ అని తెలిపారు. ఈ పెట్టెలో భారీగా నగదు ఉందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఇది నిజం కాకుంటే మోదీ విచారణకు సహకరించాలన్నారు. ఈ విషయమై కర్ణాటక పీసీసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆనంద్ శర్మ వెల్లడించారు. అంబేడ్కర్ జయంతి రోజున ప్రతిపక్షాలపై విమర్శలు మాని, గత ఐదేళ్లకాలంలో ఏం చేశారో దేశప్రజలకు చెప్పాలని మోదీకి సూచించారు. దమ్ముంటే రఫేల్ ఒప్పందంపై అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో జరిగిన సమావేశం మినిట్స్‌ను బయటపెట్టాలని మోదీని డిమాండ్ చేశారు. దీనివల్ల అన్ని ఆరోపణలకు ఒకేసారి తెరపడుతుందని వ్యాఖ్యానించారు. సాయుధ బలగాల త్యాగాలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంతో అప్పటి ప్రధాన ఇందిరాగాంధీ రాజకీయంగా లబ్ధిపొందారని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పడాన్ని తప్పుపట్టిన ఆనంద్ శర్మ, ఈ వ్యాఖ్యలపై సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. -
ప్రతిరోజు స్పెషల్ చాపర్‌లో షూటింగ్‌కు..!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రస్తుతం జీరో పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షారూఖ్ మరగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కు వెళ్లేందుకు రోజూ షారూఖ్ స్పెషల్ చాపర్ ను వినియోగిస్తున్నారట. రోజు ముంబై ట్రాఫిక్ కారణంగా షూటింగ్ ఆలస్యమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రిలీజ్ డేట్విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు చిత్రయూనిట్. దీంతో ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవటం, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ భారీగా ఉండటంతో యూనిట్ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. రోజూ ట్రాఫిక్ కారణంగా షారూఖ్ షూటింగ్ కు ఆలస్యంగా వస్తుండటం వల్ల కూడా అనుకున్న సమయానికి షెడ్యూల్‌ను పూర్తి చేయలేకపోతున్నారట. అందుకే స్పెషల్ చాపర్ వినియోగించాలని నిర్ణయించారు. షారూఖ్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క శర్మ, అభయ్ డియోల్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణే, రాణీ ముఖర్జీ, కాజోల్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. -
షాకింగ్.. సరిహద్దులో పాక్ ఆర్మీ హెలికాప్టర్లు..
సాక్షి, జమ్ముకశ్మీర్ : పాకిస్థాన్ మరోసారి హద్దు మీరింది. సరిహద్దులో పిల్ల చేష్టలు ఆడబోయింది. ఓ పక్క చొరబాట్లకు పాల్పడుతూ, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు దిగుతున్న పాక్ ఏకంగా హెలికాప్టర్లతో దేశంలోకి చొరబడే దుస్సాహాసానికి ఒడిగట్టింది. ఏకంగా మూడు హెలికాప్టర్లతో పాక్ ఆర్మీ భారత భూభాగంలోకి అడుగుపెట్టింది. పూంచ్ సెక్టార్‌లోని 300 మీటర్లలోపలికి హెలికాప్టర్లు వచ్చాయి. భారత ఆర్మీ ఈ దృశ్యం చూసి అప్రమత్తం అయింది. దీంతో వెంటనే పాక్ ఆర్మీ హెలికాప్టర్లు తోకముడిచాయి. వెనుదిరిగి వెళ్లిపోయాయి. ఏ మాత్రం అవి ఆలస్యం చేసినా భారత బలగాల చేతులో నేలకూలి పెను సంచలనంగా మారేది. ఈ ఘటనపై భారత ఆర్మీ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పాక్ హైకమిషనర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, పాక్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే యోచన చేస్తున్నారు. -
పెళ్లి మండపానికి హెలికాఫ్టర్‌లో..
సాక్షి, ముంబై: కన్నబిడ్డపై ఉన్న మమకారాన్ని ఓ తండ్రి వినూత్నంగా చాటుకున్నాడు. ఆమె వివాహం పదికాలాలపాటు పదిలంగా గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాడు. నూతన వధువును పెళ్లిమండపం వద్దకు తీసుకురావడానికే ఏకంగా హెలికాప్టర్ తెచ్చాడు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పంఢరిపూర్ తాలుకా ఉపరీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఉపరీ గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి దత్రాత్రేయ మోహితే కూతురు ప్రాజక్త వివాహం సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడి తాలుకాకు చెందిన సూరజ్ కదంతో నిశ్చయమైంది. గురువారం వీరి పెళ్లి జరుగనున్న నేపథ్యంలో బుధవారం ఉపరీ గ్రామంలో హెలికాఫ్టర్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చూడటానికి హెలికాప్టర్ క్యూకట్టారు. పెళ్లి కూతురుని మండపానికి తీసుకెళ్లడానికి హెలికాఫ్ట్టర్ వచ్చిందని తెలుసుకొని బంధువులు, స్థానికులు, గ్రామస్తులు అవాక్యయ్యారు.