షాకింగ్‌.. సరిహద్దులో పాక్‌ ఆర్మీ హెలికాప్టర్లు.. | Pak Army chopper flew over terror launchpad | Sakshi
Sakshi News home page

షాకింగ్‌.. సరిహద్దులో పాక్‌ ఆర్మీ హెలికాప్టర్లు..

Published Wed, Feb 21 2018 5:37 PM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

Pak Army chopper flew over terror launchpad - Sakshi

భారత సరిహద్దులో ఎగురుతున్న పాక్‌ ఆర్మీ హెలికాప్టర్‌

సాక్షి, జమ్ముకశ్మీర్‌ : పాకిస్థాన్‌ మరోసారి హద్దు మీరింది. సరిహద్దులో పిల్ల చేష్టలు ఆడబోయింది. ఓ పక్క చొరబాట్లకు పాల్పడుతూ, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు దిగుతున్న పాక్‌ ఏకంగా హెలికాప్టర్లతో దేశంలోకి చొరబడే దుస్సాహాసానికి ఒడిగట్టింది. ఏకంగా మూడు హెలికాప్టర్లతో పాక్‌ ఆర్మీ భారత భూభాగంలోకి అడుగుపెట్టింది. పూంచ్‌ సెక్టార్‌లోని 300 మీటర్లలోపలికి హెలికాప్టర్లు వచ్చాయి.

భారత ఆర్మీ ఈ దృశ్యం చూసి అప్రమత్తం అయింది. దీంతో వెంటనే పాక్‌ ఆర్మీ హెలికాప్టర్లు తోకముడిచాయి. వెనుదిరిగి వెళ్లిపోయాయి. ఏ మాత్రం అవి ఆలస్యం చేసినా భారత బలగాల చేతులో నేలకూలి పెను సంచలనంగా మారేది. ఈ ఘటనపై భారత ఆర్మీ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పాక్‌ హైకమిషనర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, పాక్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే యోచన చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement